అయితే నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో హెచ్.టీ విద్యుత్ లైన్లు అడ్డుగా ఉన్నాయని తెలుస్తోంది. ఆ లైన్లను తొలగించాలని సీఆర్డీఏ అధికారులు ట్రాన్స్ కోకు లేఖ రాయడం గమనార్హం. ఈ లైన్లను తొలగించే పనులను ఇప్పటికే కాంట్రాక్ట్ కు ఇచ్చారని సమాచారం అందుతోంది. ఫేజ్1 లో 300 పడకలతో ఆస్పత్రిని నిర్మించనున్నారని తెలుస్తోంది.
భవిష్యత్తులో దీనిని 1000 పడకలకు విస్తరించే దిశగా అడుగులు పడుతున్నాయని భోగట్టా. ఆస్పత్రి నిర్మాణం కోసం యాజమాన్యం ఇప్పటికే పలు డిజైన్లను తయారు చేసిందని తెలుస్తోంది. బాలయ్య ఇప్పటికే ఈ ఆప్సత్రికి సంబంధించి సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చి రెండుసార్లు అధికారులతో బాలయ్య చర్చించారని తెలుస్తోంది. మరోవైపు యాడ్స్ ద్వారా సంపాదించిన డబ్బులను బాలయ్య పేదల కోసం ఖర్చు చేస్తున్నారని సమాచారం.
తన క్యాన్సర్ ఆస్పత్రికి ఆ డబ్బులను విరాళంగా ఇస్తూ పేదలకు మంచి వైద్యం అందేలా బాలయ్య అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. బాలయ్య కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటుండగా ఈ హీరో రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉంది. డాకు మహారాజ్ మూవీ ప్రమోషన్స్ త్వరలో మొదలు కానుండగా ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్ హీరో బాలయ్య డాకు మహారాజ్ ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బాలయ్య ఎప్పటినుంచి ఈ షోపై దృష్టి పెడతారో చూడాల్సి ఉంది.