ఇక నిజానికి పుష్ప 2 ఫాంటసీ , గ్రాఫిక్స్ , విఎఫెక్స్ కి సంబంధించిన జోనర్ కాదు .. చెప్పాలంటే ఇది పక్కా కమర్షియల్ సినిమా .. ఇలాంటి సినిమాలు పక్క మాస్ ఆడియన్స్నే టార్గెట్ చేసుకుంటూ వస్తాయి .. కానీ ఒక పాన్ ఇండియా మూవీగాా సుకుమార్ ఎంత కష్టపడి చేసింది ఆర్టిస్ట్ నుంచి బెస్ట్ రాబెట్టుకోవడానికి ఎంత తపన పడింది రెండు నిమిషాలు వీడియోలు ఎంతో చక్కగా చూపించారు .. ఇక యాక్షన్ ఎపిసోడ్లు అల్లు అర్జున్ రిస్క్ తీసుకుని చేసిన స్టంట్లు , జాతర ఫైట్, హెలికాప్టర్ చేజ్ వయాగ్రా సన్నివేశాలన్నీ శాంపిల్స్ రూపంలో వదిలారు .. చిన్న ఎక్స్ప్రెషన్ల కోసం కూడా దర్శకుడు సుకుమార్ ఎందులోనూ రాజీ పడకుండా ఎలా చేస్తారనే అవగాహన ఇందులో చూపించారు .. ఇక తెర వెనుక మొదటి శ్రామికుడు మాత్రం సుకుమారని కచ్చితంగా దీంతో అర్థమైంది.
ఇక బన్ని ఎప్పుడూ చెబుతున్నట్టు ఈ క్రియేట్ జీనియస్స్ కోసమైనా పుష్ప 2ను బ్లాక్ బస్టర్ అవ్వాలని సగటు మూవీ లవర్స్ కోరుకోవడంలో ఎలాంటి సందేహం లేదు .. ఐదు సంవత్సరాల కాలాన్ని పుష్ప రెండు భాగాల కోసం కేటాయించిన సుకుమార్ మళ్లీ పుష్ప3 ఎప్పుడు తీస్తారో తెలీదు కానీ ఒకపక్క మాస్ మూవీకి ఇంత హైప్ తీసుకురావచ్చు అని రుజువు చేసింది మాత్రం సుకుమార్. దేవిశ్రీ ప్రసాద్ నుంచి ఫహద్ ఫాజిల్ వరకు, రష్మిక మందన్న నుంచి శ్రీలీల వరకు పనిచేసిన ప్రతి ఒక్కరికి గొప్ప మైలురాయిగా నిలిచిపోనున్న పుష్ప 2 ది రూల్ ఏకంగా రాజమౌళి రికార్డునే లక్ష్యంగా పెట్టుకుంది. టాక్ పాజిటివ్ వస్తే మాత్రం ఐకాన్ స్టార్ అన్నంత పని చేస్తాడు.