టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ గురించి మనం ఎంత చెప్పుకున్న అది తక్కువగానే ఉంటుంది . ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ కి సంబంధించిన ఏవి ప్లే అవ్వగానే సుకుమార్ భార్య అదే విధంగా అల్లు అర్జున్ - రష్మిక మందన్నా ఎంత ఎమోషనల్ గా స్పందించారో అందరికీ తెలిసిందే. ఆయన రాత్రికి రాత్రి ఏమి స్టార్ డైరెక్టర్ అయిపోలేదు . ఎన్నో సినిమాలు డైరెక్ట్ చేశారు . కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి .. కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. సినిమాని సినిమాగా కాకుండా ప్రాణంగా భావించి తెరకెక్కించే డైరెక్టర్ మన ఇండస్ట్రీలో ఉండే ది ఒకే ఒక్కడు ..ఆయనే సుకుమార్ .


ఈ విషయాన్ని చాలామంది స్టార్స్ కూడా స్టేజిపై చెప్పి సుకుమార్ కి క్రజీ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేలా చేశారు . కాగా సుకుమార్ చాలా రోజుల నుంచి ఒక హీరోయిన్ తో సినిమా తెరకెక్కించాలి అని బాగా ఆశ పడుతున్నారు . ఆమె మరి ఎవరో కాదు కీర్తి సురేష్.  కీర్తి సురేష్ మహానటి సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా రాకపోతుందా అంటూ వెయిట్ చేసిందట.  సుకుమార్ సైతం కీర్తి సురేష్ తో సినిమా తెరకెక్కించడానికి బాగా ఇంట్రెస్ట్ చూపించాడు .



కానీ కాంబో సెట్ అవ్వలేదు. అయితే త్వరలోనే కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుంది. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ సినిమాలో నటిస్తుందా..? నటించదా ..? అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఒకవేళ నటించను అని చెప్తే మాత్రం ఇక సుకుమార్ కి కీర్తి సురేష్ తో సినిమాను తలకెక్కించడం అనేది ఒక్క కల. ఆ కల ఎప్పటికి కలగానే మిగిలిపోతుంది అంటున్నారు జనాలు.  అంతేకాదు సాయి పల్లవి తో సైతం సుకుమార్ సినిమా తెరకెక్కించాలి అని ఆశ పడుతున్నారు . అయితే రామ్ చరణ్ తో కమిట్ అయిన సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా సెలెక్ట్ అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . సాయి పల్లవి అంటే సుకుమార్ కి చాలా చాలా ఇష్టం అన్న విషయం ఓ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో బయటపడింది.  స్టేజ్ పైన లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ ఇచ్చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: