పక్కాగా జెన్యూన్ గా మాట్లాడాలి అంటే అసలు మెగా వెర్సెస్ అల్లు వార్ జరుగుతున్న దానిలో ఎవరిది ..? బన్ని తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేయడం అల్లు అర్జున్ చేసిన తప్పా..? తన సపోర్ట్ చేసిన క్యాండిడేట్ ఓడిపోవడం అల్లు అర్జున్ చేసిన పాపమా ..? అల్లు అర్జున్ ప్రమేయం లేకుండానే అల్లు అర్జున్ పై పొలిటికల్ పరంగా కొంతమంది పొలిటిషియన్స్ మాట్లాడుతూ ఉండడం అల్లు అర్జున్ చేసిన తప్పా..?  ఎంతో కష్టపడి ఎన్నో ఏళ్ళు శ్రమించి నటించిన పుష్ప2 సినిమాను అడ్డుకుంటాం అనడం ఎంతవరకు న్యాయం ..?


చాలామంది బన్నీ పుష్ప2 ఫై హ్యూజ్ ట్రోలింగ్ చేస్తున్నారు . పుష్ప 2 సినిమా రిలీజ్ ని అడ్డుకుంటాం ..రిలీజ్ అయితే ఫ్లాప్ చేస్తామంటూ ఓపెన్ గా సవాల్ విసిరుతున్నారు . నిన్న మొన్నటి వరకు మా బన్నీ మా బన్నీ అంటూ కాలర్ ఎగరేసి మరీ చెప్పిన కుర్రాళ్ళు ఇప్పుడు బన్నీ అంటే ఓ బద్ధ శత్రువులా చూస్తున్నారు.  దానికి కారణం పొలిటికల్ పరంగా వచ్చిన ఇష్యూస్ . అయితే పొలిటికల్ పరంగా కావాలని బన్నీ వేలు పెట్టలేదు ..తన ఫ్రెండ్ అడిగితే క్యాజువల్ మీట్ కి వెళ్ళాడు ..అది కాస్త పబ్లిసిటీగా మారిపోయింది .



అందులో బన్ని చేసిన తప్పేముంది. తన సినిమాకి  తను ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు . హుందాగా మాట్లాడుతున్నాడు .. అందులో బన్నీకి హెడ్ వెయిట్ ఏముంది..? అంటూ బన్నీ ఫాన్స్ మాట్లాడుతున్నారు.  అంతేకాదు కొంతమంది మెగా ఫ్యాన్స్ మరి ఓవర్గా బన్నీను ట్రోల్ చేయడం అస్సలు బాగోలేదు అంటూ అభిప్రాయపడుతున్నారు. చాలామంది బన్నీ మాట్లాడిన స్పీచ్ బన్నీ హెడ్ వైట్ కి కారణం అంటున్నారు . అయితే బన్నీ హెడ్ వెయిట్ కాదు సెల్ఫ్ రెస్పెక్ట్ ..కష్టపడి పైకి ఎదిగిన ప్రతి ఒక్కరికి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది . కష్టపడి విజయం సాధిస్తే అసలు రెస్పెక్ట్ ఏంటో మీకు అర్థమవుతుంది ..అంటూ చాలా బోల్డ్ గా మాట్లాడుతున్నారు బన్నీ ఫాన్స్ . దీంతో బన్నీ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. అయితే మీ దృష్టిలో మీరు ఏమనుకుంటున్నారు ..బన్నీ ఇచ్చిన స్పీచెస్ లో ఆయన మాట్లాడుతున్న విధానంలో మీకు హెడ్ వెయిట్ కనిపిస్తుందా ..? లేక బన్నీ కష్టపడి స్వయం శక్తులతో ఎదిగిన సెల్ఫ్ రెస్పెక్ట్ కనిపిస్తుందా..?

మరింత సమాచారం తెలుసుకోండి: