ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులతో పాటు డైరెక్టర్లు అలాగే రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నట్లు సమాచారం.. ముఖ్యంగా మెగా కుటుంబ సభ్యులు కూడా ఈ పెళ్లికి హాజరు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరి వివాహానికి సంబంధించి అన్ని పనులు కూడా అటు నాగచైతన్య, ఇటు శోభిత ఇద్దరూ కూడా దగ్గరుండి మరి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది..అయితే వీరి వివాహానికి సంబంధించి ఫోటోలను సైతం చూడడానికి అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. గతంలో సమంతను ప్రేమించి వివాహం చేసుకున్న నాగచైతన్య కొన్ని కారణాల చేత విడిపోయారు.. అయితే నాగచైతన్య సోషల్ మీడియాలో కూడా సమంతకు సంబంధించి కొన్ని ఫోటోలు ఉండడంతో ఈ విషయం శోభిత, నాగచైతన్య పెళ్లి సమయంలో హాట్ టాపిక్ గా మారుతున్నది.
మొత్తానికి ఓకే ఏడాదిలో అక్కినేని కుటుంబం నుంచి రెండు గుడ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి. ఒకటి నాగచైతన్య పెళ్లితో పాటు అఖిల్ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది..అఖిల్ వివాహాన్ని వచ్చేయేడాది చేయబోతున్నట్లు తెలియజేశారు నాగార్జున.. నాగచైతన్య సినిమాల విషయానికి వస్తే తండేల్ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం..