టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఆఖరుగా నా సామి రంగ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికి చాలా కాలమే అవుతున్న ఇప్పటివరకు నాగ్ నటించబోయే నెక్స్ట్ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇక ప్రస్తుతం నాగార్జున , ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర సినిమాలోనూ , రజనీ కాంత్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ మూవీ లో కీలక పాత్రలలో నటిస్తున్న తాను హీరోగా నటించబోయే సినిమాకు సంబంధించిన మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయడం లేదు. ఇకపోతే నాగ్ నెక్స్ట్ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శ్రీ హర్ష కొనుగంటి ఒకరు. ఈయన ఉషారు అనే మూవీతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత రౌడీ బాయ్స్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కొంత కాలం క్రితం ఈయన ఓం భీమ్ బుష్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక నాగార్జున తన నెక్స్ట్ మూవీ ని శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఆల్రెడీ శ్రీ హర్ష , నాగార్జునకి ఓ కథను వినిపించగా ... ఆయనకు ఆ కథ అద్భుతంగా నచ్చడంతో ఈ యువ దర్శకుడి సినిమాలో నటించడానికి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: