అయితే చాలామంది ఫాన్స్ బన్నీ పర్ఫామెన్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటే మరి కొంతమంది ఫ్యాన్స్ మాత్రం సినిమా రిలీజ్ టైం కి ఒక్క నిమిషం ముందు అయినా మెగా ఫ్యామిలీ హీరోస్ పుష్ప 2 పై స్పందిస్తారా..? లేదా..? అన్నది హాట్ టాపిక్ గా మారుస్తున్నారు. సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు కూడా బన్నీని సపోర్ట్ చేస్తూ వచ్చారు. బన్నీ సినిమాలకు ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు. మరి పుష్ప 2 లాంటి బిగ్ బడా మూవీ విషయంలో ఎందుకు మెగాస్టార్ చిరంజీవి ఒక్క పోస్ట్ పెట్టడం లేదు ..?
ఒక్క మాట మాట్లాడడం లేదు ..? అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ గా మారింది. కనీసం పుష్ప షో పడే ఒక్క నిమిషం ముందైన చిరంజీవి ఒక్క పోస్ట్ పెట్టిన అది చాలా హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది అల్లు ఫాన్స్ కి అంటున్నారు . అందుకే అందరి కళ్ళు ఇప్పుడు మెగాస్టార్ సోషల్ మీడియా ఖాతా పైన పడ్డాయి . మరొకపక్క రామ్ చరణ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ పుష్ప 2 స్పందిస్తారా..? లేదా..? అంటూ వెయిట్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. చూడాలి మరి ఫస్ట్ బొమ్మ పడేలోపైన మెగా ఫాన్స్ పుష్ప2 స్పందిస్తారో..? లేదో ..?చాలామంది మాత్రం మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి చెడింది అని అందుకే ఇద్దరు దూరం దూరంగా ఉంటున్నారు అని వాళ్ళ ఫ్యామిలీ మేటర్ వాళ్ళు చూసుకుంటారు మధ్యలో మీరు కలుగజేసుకోకుండా వాళ్ల ప్రైవసీని వాళ్లకు ఇవ్వండి అంటూ సజెషన్స్ ఇస్తున్నారు..!