ప్రస్తుతం ఎవరి నోట విన్నా పుష్ప ది రూల్ సినిమా పేరు వినిపిస్తోంది. బన్నీ సుకుమార్ మూడేళ్ల కష్టం పుష్ప2 బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. పుష్ప2 కు హిట్ టాక్ వస్తే మెగా హీరోలు సపోర్ట్ చేస్తారా అనే చర్చ సైతం జరుగుతోంది. మెగా హీరోలు బన్నీ విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి మెగా ఫ్యాన్స్ వల్లే బన్నీ ఈ స్థాయికి ఎదిగాడు.
 
మెగా ఫ్యాన్స్ దూరంగా ఉండి ఉంటే పుష్ప2 సినిమాకు ఈ రేంజ్ బుకింగ్స్ ఉండేవి కాదు. పుష్ప ది రూల్ సినిమాలొ స్టార్టింగ్ టు ఎండింగ్ పక్కా కమర్షియల్ సీన్స్ ఉంటాయని సమాచారం అందుతోంది. సినిమాను ఎన్ని అంచనాలు పెట్టుకుని చూసినా సినిమా మాత్రం నిరాశపరచదని సమాచారం అందుతోంది. సెన్సార్ టాక్ కూడా పూర్తిస్థాయిలో పాజిటివ్ గా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయింది.
 
పుష్ప2 సినిమాకు పవన్ కళ్యాణ్ టికెట్ రేట్ల విషయంలో సహాయం చేశారు. గతంలో ఏ సినిమాకు టికెట్ రేట్లకు సంబంధించి దక్కని బెనిఫిట్స్ ఈ సినిమాకు లభించాయి. సినిమాకు భారీ స్థాయిలో ఖర్చు చేయడం కూడా టికెట్ రేట్లు పెరగడానికి ఒక విధంగా కారణమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రూల్ సినిమా ఆసక్తికర ట్విస్టులతో ఉండనుందని టాక్.
 
మేకర్స్ కు ఈ సినిమా విషయంలో టెన్షన్ మామూలుగా లేదు. ఈ సినిమాకు టికెట్ రేట్లను కొంతమేర తగ్గిస్తే బాగుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పుష్ప ది రూల్ సినిమా నెక్స్ట్ లెవెల్ మూవీ అవుతుందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. పుష్ప ది రూల్ కలెక్షన్ల పరంగా కూడా టాప్ మూవీ అనిపించుకుంటుందేమో చూడాల్సి ఉంది. పుష్ప ది రూల్ టాలీవుడ్ రేంజ్ ను పెంచే మూవీ అని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: