ఏంటి 22 ఏళ్ల కూతుర్ని పెట్టుకొని యాంకర్ ఝాన్సీ రెండో పెళ్లి చేసుకుంటుందా.. యాంకర్ ఝాన్సీ రెండో పెళ్లి వార్తల్లో ఉన్న నిజమెంతా..ఇంతకీ ఝాన్సీ పెళ్లి వార్తలు ఎందుకు వైరల్ అవుతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం.. ఒకప్పుడు యాంకర్స్ అంటే సుమా కనకాల,ఝాన్సీ,శిల్పా చక్రవర్తి వంటి వాళ్ళు ఉండేవారు.ఆ తర్వాత కాలంలో చాలామంది యాంకరింగ్ రంగాన్ని ఎంచుకున్నారు. అయితే వీరందరిలో యాంకర్ ఝాన్సీ కేవలం యాంకర్ గానే కాదు పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ స్టార్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పటికి కూడా ఎన్నో సినిమాల్లో అమ్మ,అత్త,పిన్ని పాత్రలు పోషిస్తూ ఇండస్ట్రీలో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యింది. ముఖ్యంగా యాంకర్ ఝాన్సీ వెంకటేష్ హీరోగా చేసిన తులసి మూవీలోని కోకాపేట ఆంటీ అనే పాత్ర ద్వారా ఇండస్ట్రీలో ఫేమస్ అయింది. అయితే అలాంటి యాంకర్ ఝాన్సీ మొదట ఇండస్ట్రీలో కమెడియన్ గా.. విలన్ గా.. నటించే జోగినాయుడిని పెళ్లి చేసుకుంది. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న జోగినాయుడు, ఝాన్సీలకు ఒక కూతురు పుట్టింది.

 అయితే కూతురు పుట్టాక ఏం జరిగిందో ఏమో కానీ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఇక విడిపోయే సమయంలో వారానికి ఒక్కసారైనా తన కూతుర్ని చూపించాలని జోగినాయుడు చెప్పారు. కానీ అలా చూపించడానికి కూడా ఝాన్సీ అడ్డు చెప్పింది.అలా దొంగ చాటుగా జోగి నాయుడు చాలాసార్లు తన కూతుర్ని చూడడానికి వెళ్లేవాడట.అయితే జోగినాయుడు ఝాన్సీ విడాకులు ఇచ్చాక మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.కానీ ఝాన్సీ మాత్రం ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా కూతురితో ఒంటరిగానే ఉంటుంది. అయితే తాజాగా ఝాన్సీ రెండో పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఝాన్సీ కూతురు ధన్య తాజాగా తన తల్లి ఝాన్సీ తో కలిసి ఆహలో స్ట్రీమింగ్ అవుతున్న కాకమ్మ కథలు అనే టాక్ షో కి వచ్చింది. అయితే ఈ టాక్ షోలో కి హోస్టుగా బోల్డ్ బ్యూటీ తేజస్వి మదివాడ చేస్తుంది.

 అయితే ఈ టాక్ షోలో ఎన్నో ప్రశ్నలు వేసింది తేజస్వి. ఇక ఆ ప్రశ్నలన్నింటికీ ఝాన్సీ కూతురు టకటకా సమాధానాలు చెప్పింది.ఇక ఝాన్సీ కూతురు ధన్య తన హైట్ ఎంత తన ఏజ్ ఎంత అన్ని విషయాలు చెప్పడంతో సినిమాల్లో అవకాశాలు రావాలంటే ఈ మాటలనే చెప్పకూడదు అంటూ తేజస్వి చెప్పింది. అయితే టాక్ షోకి వెళ్తే కచ్చితంగా ఏదో ఒక కాంట్రవర్సీ క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు. అలా తేజస్వి మదివాడ కూడా యాంకర్ ఝాన్సీ ని మీరు రెండో పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అంటూ ఒక షాకింగ్ ప్రశ్న అడిగింది. అయితే ఈ ప్రశ్నకి ఝాన్సీ చాలా సీరియస్గా పేస్ పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. మరి యాంకర్ ఝాన్సీ తన రెండో పెళ్లి వార్త పై ఏ విధంగా రియాక్ట్ అవుతుందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో యాంకర్ ఝాన్సీ రెండో పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: