భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రేపు ప్రీమియర్ షో లతో ఈ సినిమా టాక్ ఏంటి అన్న విషయం తెలియబోతుంది. కాగా ఈ సినిమా విడుదలకు అడుగడుగున అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఇక సినిమా విడుదలను నిలిపివేయాలి అంటూ హైకోర్టులో పిటీషన్లు దాఖలవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవల సతీష్ అనే వ్యక్తి ప్రీమియర్ షో టికెట్ రేట్లు 800 రూపాయలు పెట్టడం ఏంటి అంటూ ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ వేయగా హైకోర్టు దీనిని కొట్టివేసింది. అయితే ఇటీవల మరో పిటిషన్ కూడా దాఖలు అయింది.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాను తీశారని.. శ్రీశైలం అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. పుష్ప2 సినిమా విడుదలను నిలిపివేయాలి అంటూ హైకోర్టును కోరారు. పుష్ప మొదటి పార్ట్ విడుదలైన సమయంలోనే ఎంతోమంది యువకులు ఎర్ర చందనం చెట్లు నరికేసారని.. ఇక ఇప్పుడు ఈ సినిమా కూడా విడుదలయితే మరిన్ని చెట్లను నరికేసే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు శ్రీశైలం. అయితే ఈ పిటీషన్ హైకోర్టు కొట్టి వేసింది. సినిమా చూశాకే విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చిందని డిప్యూటీ సోలిసిటర్ జనరల్ వాదించారు. ఊహ జనితంగా తీసిన మూవీ విడుదలను నిలిపివేయలేము అంటూ కోర్టు స్పష్టం చేసింది. కోర్టు సమయం వృధా చేసినందుకు జరిమానా విధిస్తాము అంటూ పిటిషనర్ ను హెచ్చరించింది.