సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కిన పుష్ప సినిమా దాదాపు మూడేళ్ల క్రితం థియేటర్లలో విడుదలై ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం రాజమౌళి సినిమాలు మాత్రమే పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవుతాయి అని అందరూ అనుకుంటున్న వేళ సుకుమార్ తన డైరెక్షన్ తో అందరిని మెస్మరైజ్ చేసేసాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ అనే పాత కాన్సెప్ట్ ని తీసుకున్నప్పటికీ సరికొత్తగా సినిమాను తెరకెక్కించి ఏకంగా సెన్సేషన్ విజయాన్ని సాధించాడు అన్న విషయం తెలిసిందే. ఈ మూవీతో అల్లు అర్జున్ ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకున్నాడు.


 అయితే ఇక ఈ సినిమాకు సీక్వల్ గా తెరకెక్కబోయే పార్ట్ 2 పై అప్పట్లోనే భారీ రేంజ్ లోనే అంచనాలు పెరిగిపోయాయి. ఇక తర్వాత ఈ సినిమాకు సంబంధించి ఒక్కో అప్డేట్ విడుదల చేస్తూ ఉండడంతో అంచనాలు రెట్టింపు అవుతూ వచ్చాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ అయితే పుష్ప-2 పై అభిమానుల్లో ఉన్న అంచనాలు ఆకాశాన్ని అంటేలా చేసింది అనడంలో సందేహం లేదు. ఇక రేపు ఎంతో గ్రాండ్గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీంతో మూడేళ్ల నిరీక్షణకు తెరదించి ప్రీమియర్ షోలోనే అల్లు అర్జున్ పుష్ప రాజ్ విశ్వరూపం చూడాలని అభిమానులు అందరూ కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఫాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ తెలిసి తెగ నిరాశ పడిపోతున్నారు.


 ప్రస్తుతం విడుదలకు ముందే పుష్ప - 2 మూవీకి షాక్ తగిలినట్టు తెలుస్తుంది. ఈనెల 5వ తేదీన అంటే రేపు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. కానీ 3Dలో మాత్రం రిలీజ్ అవ్వట్లేదు అని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇంకా ప్రింట్లు రెడీ కాకపోవడమే దీనికి కారణం అంటూ తెలిపాయి. అయితే ఈనెల 13 నుంచి 3d వర్షన్ అందుబాటులో ఉంటుందని సినీ వర్గాల నుంచి సమాచారం. దీంతో ఇక 13వ తేదీ వరకు టికెట్ కొనుక్కుని పుష్ప సినిమా చూడడానికి వెళ్ళిన ప్రేక్షకులకి 3D వర్షన్ లో సినిమా చూడటం సాధ్యపడదు అని చెప్పాలి. దీంతో ఈ విషయం తెలిసి అభిమానులు నిరాశ చెందుతున్నారు. మరి ఇది నిజమా అబద్దమా అనే విషయంపై మాత్రం మూవీ టీం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: