విడుదలైన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో కానీ విడుదల అవ్వకముందే అటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులందరికీ కూడా పుష్ప-2 ఫీవర్ పట్టుకుంది అన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన పుష్ప సినిమాకు సీక్వల్గా తెరకేక్కిన పార్ట్-2 రేపు గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన అభిమానులు ఇక ఇప్పుడు పండగ చేసుకోవడానికి రెడీ అయ్యారు. మరోసారి పుష్పరాజ్ సృష్టించే విధ్వంసం ఎలా ఉంటుందో చూసేందుకు సిద్ధమైపోయారు.



 కాగా ఈ సినిమా రేపు ఎంతో గ్రాండ్గా రిలీజ్ కాబోతుండగా.. ఇప్పటికే చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ లో ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  అయితే ఇక ఇటీవల అటు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా నిర్వహించారు. హైదరాబాద్లో ఈ కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దర్శకధీరుడు రాజమౌళి విచ్చేశాడు అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా ఇలా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సమయంలో సినిమాలో కీలకపాత్రలో నటించిన నటులు తప్పనిసరిగా హాజరవుతూ ఉంటారు. అంతేకాదు ఇక ఈ సినిమా తెరకెక్కించిన విధానం ఈ సినిమాలోని హైలెట్ సీన్స్ గురించి చెప్పి సినిమాపై అంచనాలను పెంచేయడం చేస్తూ ఉంటారు.


 ఎవరు ఉన్నా లేకపోయినా హీరో హీరోయిన్ తర్వాత కీలకపాత్రలో నటించే నటీనటులు మాత్రం తప్పనిసరిగా కనిపిస్తారు. కానీ ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన పుష్ప 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం కొంతమంది నటులు మిస్ అయ్యారు. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన సునీల్, ఫహద్ ఫాజిల్, జగపతిబాబు, రావు రమేష్, అజయ్, బ్రహ్మాజీ లాంటి నటులు ఈవెంట్లో కనిపించలేదు. దీంతో వీరంతా ఎందుకు రాలేదు అన్న చర్చ ప్రస్తుతం తెరమీదకి వచ్చింది. ఇప్పటికే పుష్ప నిర్మాతలతో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీకి వివాదాలు ఉన్నాయి అంటూ చర్చ జరుగుతుండగా.. ఇక ఇప్పుడు ఈ నటులకు కూడా అటు పుష్ప చిత్ర యూనిట్ తో ఏమైనా గొడవలు ఉన్నాయా అనే చర్చ జరుగుతుంది. అయితే ఇతర సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉండడం కారణంగానే ఆయా నటులు రాలేకపోయారు అంటూ అల్లు అర్జున్ ఫాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: