టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 1 అనే సినిమాలో హీరో గా నటించాడు. రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... సుకుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 మూవీ ని రూపొందించారు. ఈ మూవీ ని రేపు అనగా డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొంత కాలం క్రితం ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు నుండి ఈ మూవీ ని 3D వర్షన్ లో కూడా విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అయింది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రాష్ట్రాల టికెట్ బుకింగ్స్ లలో ఎక్కడ కూడా 3D వర్షన్ ఆప్షన్ కనబడడం లేదు. దానితో ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున 2D  ఫార్మేట్ లోనే విడుదల అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మరి 3D వర్షన్ లో ఈ సినిమా రాబోతుంది అని వార్తలు వచ్చిన కూడా ఇప్పుడు 3D లో రిలీజ్ పోవడానికి ప్రధాన కారణం సుకుమార్ ఈ సినిమాకు సంబంధించిన 2D వర్షన్ ను రెడీ చేయడానికి చాలా సమయం తీసుకున్నట్లు ,  ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో 3D వర్షన్ పనులు పూర్తి చేసే టైమ్ లేకపోవడంతో దాన్ని వదిలేసినట్లు తెలుస్తోంది.

దానితో ఈ సినిమాను పెద్ద మొత్తంలో ప్రపంచ వ్యాప్తంగా 2D వర్షన్ లోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa