- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా పుష్ప 2 ది రూల్. మూడేళ్ల క్రితం వ‌చ్చిన పుష్ప సినిమా ఎలాంటి అంచ‌నాలు లేకుండానే ఏకంగా రు. 365 కోట్ల వ‌సూళ్లు సాధించింది. పైగా నార్త్ లో అయితే అప్పుడు పుష్ప సినిమాకు ఎలాంటి ప్ర‌మోష‌న్లు లేవు. అయినా కూడా ఈ స్థాయిలో వ‌సూళ్లు సాధించింది. ఇక ఇప్పుడు పుష్ప 2 సీక్వెల్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 ఎప్పుడెప్పు డు థియేట‌ర్ల లోకి వ‌స్తుందా ? అని ఒక్క‌టే ఉత్కంఠ‌. దీనిపై స‌స్పెన్స్ వీడిపోతోంది.


మ‌రి కొద్ది గంట‌ల్లోనే పుష్ప 2 థియేట‌ర్ల లోకి రానుంది. అయితే రిలీజ్ కు ముందే ఎన్నో రికార్డులు త‌న ఖాతాలో వేసుకున్న పుష్ప 2 అదిరిపోయే రికార్డ్ కొట్టేసింది. ఆల్రెడీ జస్ట్ ప్రీ సేల్స్ తోనే 100 కోట్ల వసూళ్లు కొల్లగొట్టేసిన పుష్ప 2 బన్నీ ఖాతాలో బిగ్గెస్ట్ రికార్డు సెట్ చేసి సంచ‌ల‌నాల‌కు అప్పుడే తెర లేపే సింది. ఇక ఇది కాకుండా మేకర్స్ పుష్ప 2 సహా అల్లు అర్జున్ పేరుతో రేర్ ఫీట్ ని సెట్ చేశారు అని చెప్పాలి.


ఇక‌ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో పలు సినిమాల‌కు ఎమోజి రూపాన్ని అందిస్తుంటారన్న విష‌యం తెలిసిందే . ఇది కూడా చాలా త‌క్కువ సినిమాల కు మాత్ర‌మే జ‌రుగుతూ ఉంటుంది.  తెలుగులో అయితే రీసెంట్ గా సలార్ కి ఇలా చేయ గా ... ఇప్పుడు  పుష్ప 2 ఈ రేర్ ఫీట్ ని అందుకొని సాలిడ్ ప్రమోషన్స్ నడుమ ఇపుడు థియేటర్స్ లోకి వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: