ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప గాడి గురించే మాట్లాడుకుంటున్నారు.. మరికొద్ది గంటల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.. డిసెంబర్ 5న పుష్ప -2 విడుదల కాబోతున్నప్పటికీ ఒకరోజు ముందే యూఎస్ లో ప్రీమియర్ షోలు పడిపోతాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా చూసిన పలువురు ప్రముఖులు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఇక ఉమైర్ సందు అయితే పుష్ప టు సినిమాకి మంచి రివ్యూ ఇచ్చారు. అయితే ఈ సినిమా కంటే ముందు విడుదలైన పుష్ప-1 సంచలనాలు సృష్టించడంతో పుష్ప-2 పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే పుష్పటు మరికొద్ది గంటల్లో విడుదలవుతున్న వేళ అందరి చూపు ఆ హీరో పైనే ఉంది  ఒకవేళ ఆ హీరో గనుక పుష్ప-2 సినిమాకి సంబంధించి పోస్ట్ పెట్టకపోతే నెట్టింట్లో ఆయనకు కామెంట్లు మోతే.

మరి ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటేమెగా మేనల్లుడు పంజా సాయి దుర్గ తేజ్.. మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరో కి సంబంధించిన సినిమా విడుదలైనా సరే ఖచ్చితంగా ట్విట్టర్ ద్వారా స్పందిస్తారు. ఇప్పటికే ఆయన ఎంతోమంది హీరోల సినిమాల గురించి ట్విట్టర్లో పోస్టులు పెట్టారు. అయితే మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్న పుష్ప -2 సినిమా విడుదలయ్యాక ఈ సినిమా గురించి సాయి దుర్గ తేజ పోస్ట్ పెట్టకపోతే కచ్చితంగా సోషల్ మీడియాలో కామెంట్ల మోత మోగుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా మెగా అల్లు ఫ్యామిలి కి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఏపీలో ఎన్నికల తర్వాత అల్లు మెగా గొడవ తెర మీదకి వచ్చింది.ఆ టైంలో సాయి దుర్గ తేజ్ అల్లు అర్జున్ సోషల్ మీడియా ఖాతాని అన్ ఫాలో చేశారు. దీంతో కొత్త రచ్చ మొదలైంది. అయితే పుష్ప-2 సినిమా విడుదలయ్యాక మెగా హీరో సాయి దుర్గ తేజ్ సినిమా గురించి స్పందిస్తే గొడవ ఏమీ ఉండదు.కానీ స్పందించకపోతేనే అసలు గొడవ మొదలవుతుంది సోషల్ మీడియాలో కామెంట్ల మోత మోగుతుంది.. ప్రస్తుతం సోషల్ మీడియా జనాలందరి కళ్ళు మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ ట్విట్టర్ పైనే ఉన్నాయి. మరి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న సోషల్ మీడియా జనాలకు వైష్ణవ్ తేజ్ దొరికిపోతాడా.. లేక పోస్ట్ పెట్టి తప్పించుకుంటాడా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: