మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి తమన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మంచు మనోజ్ హీరోగా రూపొందిన శ్రీ అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. దానితో ఈ మూవీ ద్వారా ఈమెకు తెలుగులో పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ఈమె హ్యాపీ డేస్ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడంతో ఈ సినిమా ద్వారా ఈ బ్యూటీ కి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత వరుస పెట్టి ఈమెకు తెలుగు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కడం , అందులో చాలా మూవీలో మంచి విజయాలు సాధించడంతో తక్కువ సమయం లోనే తమన్నా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్థాయికి చేరింది.

ఇక ఇప్పటికి కూడా ఈమె తెలుగులో మంచి క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటూ మంచి జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తోంది. ఇకపోతే తమన్నా సినిమాల్లో హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ఈమె స్పెషల్ సాంగ్స్ చేసిన సినిమాలలో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. కొంత కాలం క్రితం విడుదల అయిన స్త్రీ 2 సినిమాలో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ లో చేసింది. ఇకపోతే ఈమె కొంత కాలం క్రితం సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరో గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ సినిమాలో నువ్వు కావాలయ్యా అంటూ సాగే స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇక ఈ స్పెషల్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.

అలాగే ఇందులో తమన్నా డాన్స్ కి , అందాలకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. తాజాగా ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ ... స్త్రీ 2 మూవీ లోని స్పెషల్ చేసినప్పుడు చాలా సంతృప్తిగా అనిపించింది. కానీ జైలర్ మూవీ లోని స్పెషల్ సాంగ్ అంత తృప్తిగా అనిపించలేదు. ఆ సాంగ్ కి సరైన న్యాయం చేయలేదేమో అనిపించింది. ఆ సాంగ్ కి మరింత డాన్స్ చేయొచ్చు అనిపించింది అని తమన్నా తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: