ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సెన్సెషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప2 ది రూల్‌.ఈ మోస్ట్ అవైటెంట్ మూవీ డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ ను పుష్ప -2 కు సీక్వెల్ గా పుష్ప 3 చేయాలని ఫ్యాన్స్ కోరగా అనుదుకు బదులుగా సుక్కు మాట్లాడుతూ బన్నీ మూడు ఏళ్లు డేట్స్ ఇస్తే తప్పుకుండా చేస్తానని అన్నారు.ఇప్పుడు పుష్ప -3 సంబంధించి సంచలన వార్త లీక్ అయింది. పుష్ప -2 ఫైనల్ మిక్సింగ్ ను ఫినిష్ చేస్తూ సౌండ్ ఇంజినీర్ రసూల్ పూకుట్టి చేసిన పోస్ట్ లో బ్యాగ్రౌండ్ లో స్క్రీన్ పై పుష్ప – 3 ది ర్యాంపేజ్ అని లోగో తో పోస్టర్ డిజైన్ చేసి ఉండడంతో పుష్ప సిక్వెల్ ముందే ఫిక్స్ చేసినట్టు కన్ఫార్మ్ అయింది. అదే టైమ్ లో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ 2022 లో పుష్ప ది రైజ్, పుష్ప -2 ది రూల్, పుష్ప -2 ది ర్యాంపేజ్ సినిమాలు చేస్తున్న సుకుమార్ కు బర్త్ డే విష్ చేస్తూ పోస్ట్ చేసాడు. అంటే పుష్ప -3 ఎప్పుడో ఫిక్స్ అయిందనే విజయ్ పోస్ట్ ను రీపోస్ట్   చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. 

పుష్ప 3 ఫోటో లీక్ కావడంతో వెంటనే తేరుకున్న సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి ఆ ఫోటోను డిలీట్ చేసాడు. కానీ అప్పటికే అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి ఈ సిక్వెల్ ను ఎప్పుడు తెరకెక్కిస్తారో రానున్న రోజుల్లో క్లారిటీ వస్తుందేమో చూడాలి.అయితే 'పుష్ప-2' తర్వాత సుకుమార్‌, అల్లు అర్జున్‌లకు వేరే కమిట్‌మెంట్స్‌ ఉన్నాయి. అవి పూర్తయిన తర్వాతే 'పుష్ప-3' కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో పుష్పాటూ క్లైమాక్స్ లో సుకుమార్ బాహుబలిని మించేలా క్లైమాక్స్ ట్విస్ట్ ఉండబోతుందని అభిమానులు ఆశిస్తున్నారు. పార్ట్ 3 లో దాన్ని రివిల్ చేస్తారేమోనని ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే 'పుష్ప-3' పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతుందని ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్నది.

ఇక పుష్ప3 గురించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెప్పాలని డిమాండ్ చేయడంతో డైరెక్టర్ సుకుమార్ క్లారిటీ ఇస్తూ.. అల్లు అర్జున్ తన జీవితంలోని ప్రైమ్ టైం తనకు ఇచ్చాడని, దాదాపు ఈ సినిమా కోసం మూడేళ్లు తన విలువైన కాలాన్ని ఇప్పటికే ఇచ్చేస్తారని సుకుమార్ పేర్కొన్నాు. మరో మూడేళ్లు ఇస్తే.. పుష్ప 3 తీయడానికి సిద్ధంగా ఉన్నానని, ఆ విషయాన్ని తన ఫ్రెండ్ బన్నీని అడిగి చెబుతానన్నారు. వాస్తవానికి అల్లు అర్జున్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయబోతున్నారు. అలాగే సుకుమార్ నెక్స్ట్ సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో తెరకెక్కించబోతున్నారు.ఇలా అల్లు అర్జున్, సుకుమార్ లకు వరుసగా ప్రాజెక్టులు ఉండడంతో ఇప్పట్లో పుష్ప 3 అనేది సాధ్యం కాదని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: