ఇండియాలోనే కాక అమెరికా, ఇతర దేశాల్లో కూడా పుష్ప 2 మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదిరిపోతున్నాయి. విడుదలకి ముందే కలెక్షన్స్ విషయంలో పుష్ప 2 కొత్త రికార్డు క్రియోట్ చేసింది. ఈ నేపథ్యంలో ప్ర స్తుతం సినిమా పరిశ్రమలో పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలు, పెద్ద డైరెక్టర్లు తమ సినిమాలను పాన్ ఇండియా చిత్రాలుగా రిలీజ్ చేసి నేషన్ వైడ్‌గా గుర్తింపును తెచ్చుకుంటున్నారు.ఇలాంటి వారిలో సౌత్ నుండి తమ మార్క్‌ను సాధించిన వారిలో ఎస్ఎస్.రాజమౌళి, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా పేర్లు ప్రధానంగా వినిపిస్తాయి. వీరు తీసిన సినిమాలకు నేషన్ వైడ్ గుర్తింపు రావడంతో వీరికి నార్త్‌లోనూ సాలిడ్ క్రేజ్ క్రియేట్ అయ్యింది.
అయితే, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తెరకెక్కించిన సినిమాలకు ఉత్తరాదిన అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. కానీ, ఆయనకు దక్కాల్సిన గుర్తింపు మాత్రం దక్కలేదనే చెప్పాలి.సుకుమార్ డైరెక్ట్ చేసిన రంగస్థలం, పుష్ప-1 చిత్రాలు ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే, ఆ సినిమాలతో రామ్ చరణ్, అల్లు అర్జున్‌లకు మంచి ఇమేజ్ వచ్చింది. కానీ, సుకుమార్‌కి మాత్రం గుర్తింపు దక్కలేదని ఆయన అభిమానులు భావిస్తున్నారు.దీంతో, ఇప్పుడు 'పుష్ప-2' మూవీ గనక వెయ్యి కోట్ల మార్క్‌ను దాటితే ఖచ్చితంగా సుకుమార్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి 'పుష్ప-2'తో సుకుమార్‌కి ఉత్తరాదిన ఆయనకు దక్కాల్సిన గుర్తింపు వస్తుందా అనేది మరికొద్ది రోజులు వెయిట్ చేస్తే తేలిపోతుంది.ఈ క్రమంలో నే పుష్ప హవా చూస్తుంటే రూ. 1000 కోట్లు ఈజీగా మొదటి వీకెండ్ లోపే వస్తాయని అంటున్నారు ఫ్యాన్స్.