సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి కెరియర్ ఎలా మలుపు తిరుగుతుంది అన్నది అస్సలు ఊహించలేం. అప్పటివరకు సాదాసీదా నటుడుగా ఉన్నవారు. ఒక్క సినిమాతో స్టార్ గా ఎదిగిపోవడం చూస్తూ ఉంటాం. ఇక స్టార్లుగా కొనసాగుతున్న వారు వరుస ఫ్లాపులతో ఇండస్ట్రీలో కనుమరుగవుతూ ఉంటారు. ఇలా చాలామంది విషయంలో జరిగింది. అయితే సూపర్ స్టార్ కృష్ణ విషయంలో కూడా ఇలాగే జరిగిందట. తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి తరం హీరోలు ఎవరు అంటే ఏఎన్ఆర్, ఎన్టీఆర్ పేరు వినిపిస్తూ ఉంటుంది.


 ఎవరికి వారే సాటి అనే రేంజ్ లో ఈ ఇద్దరు హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కల్లుగా కొనసాగారు. ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్రను వేసుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక అప్పట్లో ఇద్దరు హీరోలను అభిమానించే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు చిరంజీవిని అభిమానించి ఆయన స్ఫూర్తితోనే ఎలా అయితే ఇండస్ట్రీకి వచ్చి హీరోలుగా రాణిస్తున్నారో.. ఒకప్పుడు కూడా ఎన్టీఆర్ ఏఎన్నార్ అభిమానులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వారు ఉన్నారు. ఇలా ఎన్టీఆర్ ని అభిమానించే వారిలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరట.


 ఎన్టీఆర్ పై అభిమానంతో చెన్నైకి వెళ్లిన కృష్ణ.. ఎన్టీఆర్ ని ఒకానొక సమయంలో కలిసాడట. ఆ సమయంలో నాకు కూడా నటించాలని ఉంది.. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడిగాడట.  ఎన్టీఆర్ ను ఎంతగానో బతిమిలాడట. ఆ సమయంలో చిన్న పిల్లాడిలా ఉన్నావు బ్రదర్. మరి మూడేళ్ళ తర్వాత రా అప్పటికి హీరోగా పనికొస్తావ్.. ఛాన్సులు ఇస్తానని అప్పట్లో ఎన్టీ రామారావు చెప్పాడట. దీంతో కృష్ణ నిరాశతోనే వెనుతిరిగాడట.  కానీ కట్ చేస్తే మూడేళ్లకి కృష్ణ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే హీరో అయిపోయాడు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన తేన మనసులు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు కృష్ణ. నాలుగో ఏడాది ఎన్టీఆర్ పక్కనే మరో హీరోగా సినిమాల్లో కూడా నటించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకి తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసి ఎన్టీఆర్ పోటీగా సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్లు కూడా కొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: