1998వ సంవత్సరంలో ఏప్రిల్ 9వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమాకి జయంత్ సి పరాంజి దర్శకత్వం వహించగా చిరంజీవి సరసన రంభ హీరోయిన్గా నటించింది. ఇక రెండవ హీరోయిన్గా రచన కనిపించింది. ఇక ఈ సినిమాకు మని శర్మ అందించిన సంగీతం అయితే సినిమాలోని కథకు ప్రాణం పోసింది అని చెప్పాలి. అదే సమయంలో బ్రహ్మానందం పంచిన కామెడీ ప్రేక్షకులను థియేటర్లలో కడుపుబ్బ నవ్వించగలిగింది. ఇలా మొత్తంగా అన్ని కలిసి వచ్చి ఈ సినిమా సూపర్ డూపర్ విజయాన్ని సాధించింది.
అయితే ఇక ఈ సినిమాలో అటు హీరో క్యారెక్టర్ లో చిరంజీవి ఎంత బాగా సెట్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన కామెడీ టైమింగ్ కి యాక్షన్ కి అందరూ ఫిదా అయిపోయారు. చిరంజీవి ఈ సినిమాకు బాగా సెట్ అయ్యారు అని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ దర్శకుడు జయంత్ సి ఫరంజి ముందుగా ఈ సినిమాను చిరంజీవితో తీయాలని అనుకోలేదట. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ను హీరోగా అనుకున్నారట. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ వేరే ప్రాజెక్టుతో బిజీగా ఉండడం వల్ల ఇక ఈ సినిమాకి నో చెప్పేసాడట. ఇక ఇదే కథతో అన్నయ్య చిరంజీవిని హీరోగా పెట్టి సినిమా చేయాలని అనుకున్నారట పరాంజి. ఇక మెగాస్టార్ కి కూడా కథ నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది. చివరికి విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.