పుష్ప-2 సినిమా మ్యూజిక్ విషయంలో ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. బిజీఎం కోసం వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకోవడంతో దేవిశ్రీ కాస్త ఫీల్ అయినట్టు సమాచారం. అయితే పుష్ప -1 సినిమాలోని పాటలతో పోలిస్తే పుష్ప-2 సినిమాలోని పాటలు అంతగా ఆకట్టుకోవడం లేదని నెటిజన్స్ టాక్. ఈ సినిమాలో అన్నీ బాగున్నప్పటికీ పాటలే పెద్ద మైనస్ కాబోతున్నాయని సోషల్ మీడియా జనాలు మాట్లాడుకుంటున్నారు.
అయితే ఇప్పటికే రిలీజ్ అయిన "సూసేకి అగ్గి రవ్వ మాదిరి", "పుష్ప పుష్ప", "కిస్సిక్",పీలింగ్స్" వంటి పాటలు సంచలనం సృష్టించినప్పటికీ పుష్ప-2 తో పోలిస్తే ఇది అంతంతమాత్రంగానే ఉన్నాయి అంటూ మాట్లాడుకుంటున్నారు.దీంతో ఈ సినిమాకి పాటలే పెద్ద మైనస్ కాబోతున్నాయి అని తెలుస్తుంది. మరి చూడాలి పుష్ప -2 సినిమా విడుదలయ్యాక చూసిన జనాలు ఏ విధంగా రివ్యూలు ఇస్తారు అనేది మరి కొన్ని గంటల్లో తెలియబోతుంది