టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కెరియర్లో హిట్, ప్లాపులు అనేవి కూడా ఉన్నాయి.. సూపర్ హిట్ చిత్రాలకు కూడా ఉన్నాయి.. అలాగే సూపర్ ఫ్లాపులు కూడా ఉన్నాయి.. ఇటీవల అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నప్పుడు అల్లు అర్జున్ మాట్లాడకు వచ్చినటువంటి విషయాల విషయానికొస్తే.. నా పేరు సూర్య సినిమాకు సంబంధించినటువంటి ఫెయిల్ అయినప్పుడు ఆరు నెలలపాటు కంప్లీట్ గా వదిలేసి తననితాను తగ్గించుకొని అప్పటినుంచి విజయాల బాట పట్టానని తెలియజేశారు. సినిమాలపరంగా అల్లు అర్జున్ కృషిలో ఎలాంటి లోపం లేదు.. సినిమాలకు యాక్షన్స్ కి గాని ప్రొడక్షన్స్ కి గాని , క్యాస్టింగ్కు కానీ ఎక్కడ ప్రాబ్లం లేదు అంత సిస్టమైటిక్ గాని చేస్తూ ఉన్నారు.


సినిమాకు అదనపు పాయింట్ పబ్లిసిటీ.. పుష్ప-2 చిత్రానికి కూడా అది భారీగానే జరిగింది. సుమారుగా 50 దేశాలలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. సినిమాకి సంబంధించి ఈవెంట్స్ బూస్ట్ వంటివి బాగానే ఇచ్చారు. కానీ సోషల్ మీడియా బేస్డ్ గా తనమీద జరుగుతున్నటువంటి దాడి మామూలు రేంజ్ లో కాదు.. అది మెగా ఫ్యాన్స్ నుంచి జరుగుతోంది.. ఒక పక్కన పెద్ద వాళ్ళ మధ్య ఎలాంటి విభేదాలు లేవా అంటే.. నాగబాబు వంటి వారు ఇచ్చినటువంటి ట్వీట్ పరంగా .. అక్కడ కూడా ఒక కన్ఫ్యూజన్ అయ్యేలా చేస్తోంది.


కానీ పవన్ కళ్యాణ్ ,చిరంజీవి వంటి వారు ఇలాంటి విషయాలలో బయటపడరు.. గతంలో సాయి ధరంతేజ్ వంటి వారు కూడా అన్ ఫాలో చేయడం జరిగింది. అది కూడా పీక్ స్టేజ్ కి వెళ్లి ఒక వివాదం మారింది. అయితే అల్లు అర్జున్ మాత్రం ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ని ఎలాంటి విషయాల పైన దూషించలేదు నిందించలేదు.. పవన అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని మెగా కుటుంబం నడవాల్సి ఉంటుందనే విధంగా వ్యవహరిస్తూ ఉండేవారట.. మెగా కుటుంబం అని చెప్పుకొని ఉండాల్సిందే అనేట్టుగా వ్యవహరించేవారు మెగా ఫ్యాన్స్ ఫీలింగ్.. అయితే కేవలం అల్లు అర్జున్ తన సినిమాల ప్రమోషన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇదంతా కూడా మెగా ఫ్యాన్స్ అహంకారంగా మాట్లాడారనే విధంగా.. అలాగే వైసీపీ నేత శిల్ప రవి దగ్గరికి వెళ్లడం వల్ల మొదలయ్యింది రచ్చ.. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అలాంటిదేమీ లేదంటూ తెలియజేశారు.. టికెట్ల రేటు విషయంలో కూడా ప్రభుత్వం వైపు నుంచి సానుకూలంగానే వచ్చింది.. కానీ అభిమానులు మాత్రం ట్రోల్ చేయడానికి వెనుకడుగు వేయడం లేదు.. ముఖ్యంగా రేట్ల విషయంలో మెగా ఫాన్స్ ట్రోల్ చేస్తున్నారు.. అంతేకాకుండా సినిమా టైమింగ్ లో కూడా ట్రోల్ చేశారు.. మరి వీటన్నిటిని అల్లు అర్జున్ అధికమించి పుష్ప-2 సినిమా విజయాన్ని అందుకుంటే.. అల్లు అర్జున్కి తిరుగు ఉండదు.. ఒకవేళ ఈ సినిమా తేడా అయితే కచ్చితంగా సైకలాజికల్ గా ప్రెజర్ చాలానే ఉంటుంది.. ఇక రాబోయే రోజుల్లో కెరియర్ పైన చాలామంది దెబ్బతీసేయడానికి చూస్తారు.. ఇదంతా కూడా కేవలం అభిమానులు చేస్తున్నటువంటి అతిపెద్ద ఎటాక్ కాబట్టి.. అల్లు అర్జున్ కెరీర్లు కీలకమైనటువంటి సందర్భం ఇదే...

మరింత సమాచారం తెలుసుకోండి: