పుష్ప 2.. ఈ మూవీ కోసం తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పుష్ప మూవీ సీక్వెల్ గా పుష్ప 2 ది రూల్ రాబోతుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 5న ఈ చిత్రం విడుదల కాబోతోంది.. అంతకన్నా ఒక్కరోజు ముందుగా ప్రీమియర్స్ పడనున్నాయి. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. మొదటి భాగంగా సూపర్ హిట్ అవ్వడంతో.. దీనిపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇదిలావుండగా అనసూయ భరద్వాజ్ ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఆ ఫేమ్ తో సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తన టాలెంట్ ను చూపించండి. నటనకు ప్రాధాన్యత పాత్రలలో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్తగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. తన నటనకు విమర్శలకు నుండి కూడా ప్రశంసలు అందుకుంది.ఇదిలావుండగా తాజాగా ఆమె వేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో డిస్కషన్‌కి వచ్చింది. ఈరోజు ‘దూరపు కొండలు నునుపు’ అంటూ వేసిన పోస్ట్ అందర్నీ ఆకర్షిస్తోంది. అది ఎవరిని ఉద్దేశించి వేసిన పోస్టులో ఎవరికీ అర్థం కాకపోయినా నిన్న జరిగిన పుష్ప2 ఈవెంట్‌ గురించేనని అర్థమవుతోంది. సడన్‌గా అనసూయకు ఆ సామెత ఎందుకు గుర్తొచ్చినట్టు అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. కొందరైతే అసలు ఏం జరిగిందో చెప్పు... చెబితేనే కదా తెలిసేది అంటున్నారు.

దూరపు కొండలు నునుపు అనే సామెతను ఉపయోగించడానికి కారణం ఏమై ఉంటుందా అని ఈవెంట్‌ మొత్తాన్ని పరిశీలిస్తే.. అది దేవిశ్రీప్రసాద్‌ గురించే అయి ఉంటుందనిపిస్తోంది. ఇక ఈ ఈవెంట్‌కి రాజమౌళి, గోపీచంద్‌ మలినేని వంటి వారిని గెస్టులుగా పిలిచారు. రాజమౌళి తన స్పీచ్‌లో సుకుమార్‌ గురించి, బన్నీ గురించి కొన్ని విషయాలు చెప్పారు.చివరలో ఈ సినిమాలో అల్లు అర్జున్‌ ఇంట్రడక్షన్‌ ఎలా ఉంది  అనేది వివరిస్తూఆ ఇంట్రడక్షన్‌కి దేవి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ గురించి చెబుతున్నారు. రాజమౌళి మాటలను ఎంతో ఆసక్తిగా వింటున్నాడు దేవి. ఇంకా తన గురించి ఏం చెబుతాడోనని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. ఆ సమయంలో పక్కనే వున్న అనసూయ దేని గురించో మాట్లాడాలని దేవిని పదే పదే డిస్ట్రబ్‌ చేస్తోంది. దేవి మాత్రం రాజమౌళి మాటల్నే వింటున్నాడు. అవేమీ పట్టించుకోని అనసూయ. దేవీని విసిగిస్తోంది. దాంతో దేవి ఒక్కసారిగా చిరాకు పడ్డాడు. ఆ విజువల్స్‌ క్లియర్‌గా కనిపిస్తున్నాయి. రాజమౌళి తన గురించి ఇంకా ఏమైనా మాట్లాడతారేమోనని లేచి నిలబడే ప్రయత్నం చేశాడు దేవి. కానీ, రాజమౌళి మాటలు బన్నీ వైపు టర్న్‌ అవడంతో నిరాశగా తన సీట్‌లో కూలబడ్డాడు. అనసూయ ఈరోజు పోస్ట్ చేసిన సామెత దేవిశ్రీప్రసాద్‌ గురించే అయి ఉంటుందని అంతా భావిస్తున్నారు.  మరికొందరు మాత్రం అది దేవి గురించి కాదని, అనసూయ, విజయ్‌ దేవరకొండ మధ్య ఎప్పటి నుంచో వార్‌ జరుగుతున్న నేపథ్యంలో కొండ అనే పదం వచ్చేలా ఆ సామెత వాడి ఉంటుందని కామెంట్‌ చేస్తున్నారు. ఇందులో ఏది కరెక్ట్‌ అనేది అనసూయ చెప్పాల్సి ఉంది. మరి అనసూయ మనసులో ఏముందో ఎవరిని ఉద్దేశించి ఆ పోస్ట్ చేసిందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: