చిరంజీవి తమ్ముడుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పవన్ తనకంటూ సెపరేట్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అంటే ఒక ఉప్పెన .. ఇక చిరంజీవికి ఇండస్ట్రీలో ఎంత గొప్ప పేరు ఉందో పవన్ కళ్యాణ్ కూడా అంతే పేరు తెచ్చుకున్నారు .. ఇక అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు రాబడుతున్నాయి. అల ఈ ఇద్దరి అన్నదమ్ములతో కలిసి ఒక హీరోయిన్ నటించింది .. చిరంజీవికి అక్కగా పవన్ కళ్యాణ్ కు అమ్మగా నటించిన ఏకైక తెలుగు స్టార్ హీరోయిన్ ఎవరు అంటే .. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు సీనియర్ బ్యూటీ ఖుష్బూ ..
చిరంజీవి పక్కన హీరోయిన్గా ఖుష్బూ నటించలేదు కానీ స్టాలిన్ సినిమాలో అక్కగా నటించింది. ఇక ఈ సినిమాలో ఝాన్సీగా టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది .. ఇక అసలు సినిమాను మలుపు తిప్పే రోల్ తనది .. ఇక పవన్ కళ్యాణ్ తో కూడా ఖుష్బూ ఒక సినిమాలో నటించింది .. ఇంతకీ ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా.. ఆ సినిమా మరేదో కాదు.. అజ్ఞాతవాసి. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఖుష్బూ పవన్ కళ్యాణ్ తల్లిగా నటించింది. ఇలా పవన్ కళ్యాణ్‌కు అమ్మగా, చిరంజీవికి అక్కగా నటించిన ఏకైక తెలుగు స్టార్ హీరోయిన్‌గా ఖుష్బూ నిలిచింది .