పుష్ప-2 సినిమా గురించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా చూడడం కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురుచూస్తున్నారు.అయితే ఎట్టకేలకు సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో సినిమా టికెట్ రేట్లు మాత్రం భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికే చాలా హీరోలు తమ సినిమా టికెట్లను పెంచడం కోసం ప్రభుత్వాలను ఆర్జీ పెట్టుకొని సినిమా టికెట్ రేట్లు పెంచడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే సినిమా టికెట్ రేట్ పెంచితే నిర్మాతలకు లాభమే కానీ సగటు సామాన్య ప్రేక్షకుడికి మాత్రం ఇది తలకు మించిన భారంలా తయారవుతుంది. ఎందుకంటే చాలామంది హీరోల ఫ్యాన్స్ మొదటి రోజే తమ అభిమాన హీరో సినిమా చూడాలి అనుకుంటారు. అలా ఆ సినిమా చూడడం కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. కానీ ఆ సామాన్య అభిమాని నెక్స్ట్ విడుదలయ్యే మంచి సినిమాలను చూడడంలో మిస్ అవుతున్నారు. 

ఎందుకంటే సినిమా టికెట్ రేట్లు ఎక్కువగా పెరిగిపోవడం సగటు సామాన్య అభిమానికి తలకు మించిన భారంలా తయారవుతుంది. ఇక మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న పుష్ప-2 సినిమాకి సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఒక్కొక్క టికెట్ ధర వెయ్యి నుండి 1500 వరకు పెట్టి మరీ బుక్ చేసుకున్నారు. ఇక కొన్ని చోట్ల అయితే ఈ సినిమా టికెట్ ధర 3000 అని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.అయితే 1500 నుండి వెయ్యి రూపాయల ఖర్చు చేసి ఒక సినిమా చూసే సగటు సామాన్య అభిమాని మరో సినిమా చూడడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ సినిమా టికెట్ రేట్ల ప్రభావం తర్వాత వచ్చే సినిమాలపై ఖచ్చితంగా పడుతుంది. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే.. సంక్రాంతికి విడుదల కాబోతున్న విశ్వంభర, గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం వంటి   సినిమాలకు పుష్ప టు టికెట్ రేట్ల ఎఫెక్ట్ పడబోతుంది. 

మరి ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న విశ్వంభరా, గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ల ధరలు పుష్ప -2 సినిమా టికెట్ ధరల్లో సగం పెంచినా కూడా ఈ సినిమా చూడడానికి చాలామంది దూరమవుతారు. ఇక చివరిగా చెప్పుకోవాలంటే..నిర్మాతలు వాళ్ళ లాభాల కోసం సినిమా టికెట్ రేట్లు పెంచుతారు. కానీ అది సినిమా ఇండస్ట్రీ నాశనం అవ్వడానికే అని చాలామంది సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.అంతేకాదు ఇప్పటికే పెరిగిన టికెట్ రేట్ల వల్ల ఎంతోమంది సామాన్యులు థియేటర్లకు దూరమవుతున్నారు. కొంతమందేమో నెల రోజుల దాటితే ఓటిటిలోకి వస్తుంది కదా ఇంటి దగ్గరే చూడొచ్చు అని అనుకుంటున్నారు. ఇలా టికెట్ ధరలు పెంచి థియేటర్ కి ప్రేక్షకున్ని దూరం చేస్తున్నారని సినీ విశ్లేషకుల భావన.ఇక ఈ పుష్పటు టికెట్ రేట్లు మరింత  పెంచడం కూడా థియేటర్ కి ప్రేక్షకుడిని మరింత దూరం చేయడం అని అంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: