పుష్ప 2 సినిమా రిలీజ్ కంటే ముందు అనేక ఆటంకాలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అనేక ఆటంకాలు కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అప్పుడప్పుడు ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండేది. కానీ డిసెంబర్ ఐదో తేదీన అంటే రేపు రిలీజ్ కాబోతుంది అల్లు అర్జున్ నటించిన పుష్ప 2. షూటింగ్ పూర్తి కాకపోవడం, డిసెంబర్ మాసం సెంటిమెంటు ఇలా అనేక కారణాలవల్ల రేపు రిలీజ్ అవుతుంది ఈ సినిమా.

 అయితే ఈ సినిమా షూటింగ్ దశలోనే అల్లు అర్జున్ అలాగే మెగా కుటుంబం మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే.దీంతో అల్లు అర్జున్ అలాగే మెగా ఫ్యాన్స్ మధ్య రచ్చ కూడా చోటుచేసుకుంది. వైసిపి అభ్యర్థికి అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. సొంత మేనమామ జనసేన పార్టీ కోసం పని చేయకుండా...వైసిపి పార్టీకి అల్లు అర్జున్ ప్రచారం చేయడమే... మెగా కుటుంబానికి ఎక్కువ పని తెప్పించింది.

 దీంతో అల్లు అర్జున్ పైన మెగా ఫ్యాన్స్ మండిపడుతూనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో రేపు సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాను రిలీజ్ కాకుండా అడ్డుకుంటామని జనసేన నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. అల్లు అర్జున్... ఒక మెట్టు దిగి వచ్చి మెగా కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని జనసేన నేత చలమాల శెట్టి రమేష్ బాబు డిమాండ్ చేశారు. ఒకవేళ మెగా కుటుంబానికి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పకపోతే పుష్ప సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు జనసేన నేత రమేష్.

 మెగా ఫ్యామిలీని యావత్ ప్రపంచమే ఇష్టపడుతుందని... కానీ అలాంటి కుటుంబాన్ని కించపరిచేలా అల్లు అర్జున్ వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. నువ్వు ఒక్కడివే... ఒళ్ళు బలిసెక్కి కొట్టుకుంటున్నావ్ అని అల్లు అర్జున్ పై మండిపడ్డారు. ఇప్పటికైనా చిరంజీవి కాళ్లు కడిగి నెత్తిన చల్లుకో... అంటూ రెచ్చిపోయారు... జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు. లేదంటే పుష్ప 2 సినిమాను కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఏమాత్రం తగ్గబోమని... ఎవరు సినిమాను ఆపలేరని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: