ఇటీవలే ఈ సినిమానుండి టైటిల్‌ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్ సంక్రాంతికి సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. అయితే సంక్రాంతికి ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు కూడా విడుదల కాబోతున్నట్టు ఆల్రెడీ మేకర్స్ ప్రకటించేసారు. ఈ క్రమంలోనే డాకు మహరాజ్ సినిమా షూటింగ్ పూర్తి చేసినట్టు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. దాంతో నందమూరి ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా సంబరాలు జరుపుకుంటున్నారు.
కాగా, సంక్రాతికి ఇంకా నెల రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రమోషన్ విషయంలో ఆయా సినిమాలు దూసుకు పోతున్నాయి. విడుదలకు ఇంకా 6 వారాల సమయం ఉండగానే సినిమాల సందడి షురూ అయ్యింది. సంక్రాంతి రాబోతున్న మొదటి సినిమా గేమ్ ఛేంజర్ అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రమోట్ షురూ చేసింది. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటికే 3 పాటలు విడుదల చేయడంతో పాటు టీజర్ సైతం విడుదల కాబోతుండడంతో ఈ సినిమాపై ఫుల్ హైప్ ఉంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి రెగ్యులర్‌గా మీడియాలో చర్చ జరిగే విధంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఏదో ఒక మ్యాజిక్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే రమణ గోగులతో ఈ సినిమా కోసం పాట పాడించి హైప్ క్రియేట్ చేసారు. అయితే ఆ 2 సినిమాలతో పోల్చితే ఇప్పటి వరకు బాలయ్య 'డాకు మహారాజ్' సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ కాకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.