అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప 2 కిస్సిక్ పాట వివాదంలో చిక్కుకుంది. ఓ యువతి కారణంగా ఈ పాట వివాదంగా మారింది. దీనిపై టిటిడి అధికారులు కేసు పెట్టేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఓ యువతి రీల్ కారణంగా... ఈ రచ్చ జరుగుతుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే... తాజాగా తిరుమల శ్రీవారి కొండ సమీపంలో ఓ యువతి రీల్ చేసి డాన్స్ చేసింది. అది కూడా అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప 2 సినిమాలోని కిస్సిక్ అనే పాట కు ఆ యువతి డాన్స్ చేయడం జరిగింది.

దీనికి సంబంధించిన రీల్ ను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇంకేముంది అది క్షణాల్లోనే వైరల్ గా మారింది. అయితే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొంతమంది తిరుమల శ్రీవారి భక్తులు అలాగే హిందుత్వ వాదులు మండిపడుతున్నారు. పవిత్రమైన తిరుమల శ్రీవారి కొండ సమీపంలో ఇలాంటి పాటలు  ప్లే చేసి డాన్స్ చేయడం అవసరమా అని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హిందూ వాదులు.

 ఇలాంటి పాటలు చేసిన ఆ చిత్ర బృందంపై కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఐటెం సాంగ్స్ పేరుతో యూత్ ను  నాశనం చేస్తున్నారని.. ఇలాంటి వారిని వదలకూడదని హిందుత్వవాదులు  ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. అయితే దీనిపై కొంతమంది హిందుత్వం వాదులు టీటీడీ అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు వార్తలు.. వస్తున్నాయి.  అయితే దీనిపై టిటిడి అధికారులు చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

 ఈ వీడియో తీసిన యువతిపై కేసు పెట్టి ఆ వీడియో డిలీట్ చేయాలని టిటిడి అధికారులు నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి వివాదాల కారణంగా పుష్ప 2 సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని కొంతమంది అంటున్నారు. కాకా అల్లు అర్జున్ హీరోగా చేసిన ఈ సినిమా రేపు థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: