ఇక ఈ 2024లో ఒక్క సినిమాను కూడా విడుదల చేయని చిరంజీవి వచ్చే ఏడాదిలో మాత్రం 2 ప్రాజెక్టులతో వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే చిరు ప్రస్తుతం 2 ప్రాజెక్టుల్ని ఓకే చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అందులో ఒకటి శ్రీకాంత్ ఓదెల సినిమా కాగా, మరొకటి అనిల్ రావిపూడితో ఓ సినిమా ఉంటుందని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. దాంతో ఇక చిరు తనదైన మార్క్ కామెడీతో తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారని టాక్ నడుస్తోంది. ఇకపోతే, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నాని సమర్పణ ఒక సినిమా రూపొందబోతుంది. 2025 చివరి వరకు ఆ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇక అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్‌తో 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాతో సంక్రాంతికి రాబోతున్నాడు. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి చిరంజీవి సినిమాతో బిజీ కానున్నాడని సమాచారం. వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుందని గుసగుసలు వినబడుతున్నాయి. విశ్వంభర షూట్‌ను ఫినిష్ చేసే లోపు అనిల్ రావిపూడి స్క్రిప్ట్ రెడీ చేసుకునే ఛాన్స్ లేకపోలేదు. అలా వచ్చే ఏడాదిలో చిరు నుండి రెండు సినిమాలు విడుదల అయ్యే విధంగా చిత్ర మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు కనబడుతోంది. ఏడాది గ్యాప్‌లో మొత్తం మూడు సినిమాలను చిరంజీవి ఫ్యాన్స్ ముందుకు తీసుకు తీసుకు వస్తారనే వార్తలు వస్తున్నాయి. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన దాదాపు అన్ని సినిమాలు కామెడీ నేపథ్యంతో వచ్చినవే. అలాంటిది మెగాస్టార్ తో ఎటువంటి కామెడీ యాంగిల్ సినిమాని అనిల్ రావిపూడి చేయబోతాడో అని జనాలు ఊహాగానాలు చేస్తున్నారు.