1). సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న నాలుగవ చిత్రం పుష్ప -2
2). పుష్ప -2 చిత్రం కోసం అల్లు అర్జున్ రూ .3కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం.. అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న నటుల జాబితాలో మొదటి స్థానం ఉన్నట్లుగా ఇటీవలే ఫోర్బ్స్ ఇండియన్ మ్యాగజైన్ ప్రకటించింది..
3).2022 లో పుష్ప సినిమాకి లుక్ టెస్ట్ చేస్తున్న సమయంలో ఈ సినిమాని ప్రకటించారు. ఈ చిత్రాన్ని బెంగళూరు ,విశాఖపట్నం ,హైదరాబాద్ ,ఒడిస్సా ప్రాంతాలలో షూటింగ్ చేశారట.. 2024 నవంబర్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు
4). పుష్ప చిత్రాన్ని ఒకే భాగంలో తీద్దామనుకున్నప్పటికీ సుకుమార్ స్క్రిప్ట్ ప్రకారం కొంత షూటింగ్ అయిపోయిన తర్వాత.. నిర్మాతలలో ఒకరైన చెర్రీ ఈ సినిమా ఎంతవరకు వచ్చిందని అడగగా మూడున్నర గంటల ఫుటేజ్ రావడంతో ఆయన కోరిక మేరకు పుష్ప -1, పుష్ప -2 గా రెండు భాగాలుగా తీశారని సమాచారం. ఇప్పుడు మళ్లీ మూడేళ్ల తర్వాత పుష్ప-2 గా తీసుకువస్తున్నారు.
5). ముఖ్యంగా పుష్ప-2 లో గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ ఈ సినిమాకి హైలైట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.. ఇందులో అల్లు అర్జున్ మాతంగి వేషంలో కనిపించబోతున్నారు.. ఈ ఒక్క సన్నివేశం కోసం రూ .60 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట సుమారుగా 30 రోజులు ఈ సన్నివేశం కోసమే షూట్ చేశారట..
6). పుష్ప చిత్రంలో శ్రీవల్లి పాత్రలో రష్మిక కనిపించబోతోంది..ఈమె పాత్ర చాలా కీలకమట. ఈ సినిమా కోసం రూ .10కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం.
7). పోలీస్ ఆఫీసర్ బన్వర్ సింగ్ పాత్రలో ఫాహద్ ఫాజిల్ నటించారు..మొదటి భాగంలో ఈయన పాత్ర తక్కువగా ఉన్న..పుష్ప -2లో ఈయన నటన పాత్ర అద్భుతంగా ఉంటుందని అల్లు అర్జున్ తెలిపారు.
8). పుష్ప -2 చిత్రంలో స్పెషల్ సాంగ్ కు శ్రీలీల నటించగా రూ.2 కోట్లు తీసుకున్నట్లు టాక్..
9). పీలింగ్స్ సాంగ్ చాలా ప్రత్యేక మట ఇ పాట అన్ని భాషలలో ఉంటుందట. ముఖ్యంగా మలయాళ అభిమానులపై ప్రేమతోనే అల్లు అర్జున్ పల్లవి మలయాళంలో వచ్చేలా చేశారట.
10). పుష్ప చిత్రానికి డైలాగ్స్ శ్రీకాంత్ విస్సా అందించారు..
11). పుష్ప -2 సినిమా 3:20:38 సెకండ్లు కలదు.. అత్యధికంగా నిడివి కలిగిన తెలుగు చిత్రాలలో ఈ చిత్రం నిలిచింది.