అయితే పుష్ప2 మరికొద్ది గంటలో రిలీజ్ కాబోతుంది. అఫ్ కోర్స్ ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సుకుమార్ కి దక్కాల్సిన గౌరవం మాత్రం సుకుమార్ కి ఆల్రెడీ దక్కేసింది. చాలామంది స్టార్స్ ఈ సినిమాకి అసలు ప్రమోషన్స్ ఏ అవసరం లేదు.. సినిమా ఆ రేంజ్ లో హిట్ అవ్వబోతుంది అంటూ ముందుగానే సినిమా హిట్ ని అంచనా వేసేస్తున్నారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి రాంచరణ్ - సుకుమార్ సినిమాపైనే ఉంది .ప్రెసెంట్ రాంచరణ్ - బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమా కంప్లీట్ అవ్వాలి అంటే దాదాపు ఒకటిన్నర సంవత్సరమైనా పడుతుంది .
అయితే ఈలోపు సుకుమార్ టైం వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేక వెంటనే తన రాసుకున్న ఓ లవబుల్ లవ్ స్టోరీని టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తో తెరకెక్కించబోతున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . రష్మిక మందన్నాతో పుష్ప2 చేసిన సుకుమార్ విజయ్ దేవరకొండకు కూడా బాగా క్లోజ్ అయిపోయారట . అంతేకాదు విజయ్ దేవరకొండ సుకుమార్ కాంబో లో ఒక సినిమా రావాలి అంటే ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు .
ఫైనల్లీ ఆ మూమెంట్ ఈ విధంగా రాబోతుంది అంటున్నారు జనాలు . విజయ్ దేవరకొండతో సినిమా తెరకెక్కించిన తర్వాత సుకుమార్ చరణ్ తో సినిమాలు తెరకెక్కిస్తారట . అందుతున్న సమాచారం ప్రకారం రంగస్థలం 2 గానే ఈ సినిమా తెరకెక్కబోతుదట . అయితే ఈ సినిమాలో సమంత హీరోయిన్గా కాకుండా సాయి పల్లవి ని చూస్ చేసుకున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . వీటన్నిటిపై అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందంటూ వెయిట్ చేస్తున్నారు సుకుమార్ అభిమానులు..!