అయితే గడిచిన కొన్ని గంటలకు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పుష్ప-2 సినిమా సక్సెస్ కావాలని ఒక ట్విట్ చేయగా ఇప్పుడు తాజాగా మెగా బ్రదర్ నాగబాబు ఒక ఇంట్రెస్టింగ్ ట్విట్ చేయడం జరిగింది.. అదేమిటంటే వేలమందికి ఉపాధి కలిగించి కోట్ల మందిని అలరించే ఈ చిత్రం కచ్చితంగా విజయం కావాలని కోరుకుందామని అందరిని అలరించే ఈ సినిమాలాగే ఆదరించాలని.. ప్రతి మెగా అభిమానిని కూడా ప్రతి సినీ అభిమానిని కూడా కోరుకుంటున్నాను అంటూ తెలియజేశారు.
ప్రస్తుతం అటు అల్లు ఫాన్స్ ,మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న వార్ తో కన్ఫ్యూజన్లో ఉన్న ఫ్యాన్స్ ఇప్పుడు నాగబాబు ట్విట్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొత్తానికి రేపు పుష్ప-2 రిలీజ్ కాబోతున్న సందర్భంలో ఇలాంటి ట్వీట్ చేయడంతో అటు మెగా అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.. పుష్ప-2 సినిమా రూ .1000 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగబోతోంది. ఈ చిత్రానికి అల్లు అర్జున్ ఏకంగా రూ .300 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక రూ .10 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం.. మొత్తానికి ఈ ఏడాది చివరిలో పుష్ప-2 మేనియాతో మాత్రం ఫుల్ ఖుషి అయ్యేలా తెలుగు ప్రేక్షకులను చేస్తోంది. మరి ఏ విధంగా కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి మరి.