ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి శ్రీనివాస్ అల్లుడు శ్రీను సినిమాతో మొదటిసారిగా హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు.. తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయి శ్రీనివాస్ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించారు.. బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి చత్రపతి చిత్రాన్ని రీమిక్స్ చేయగా అక్కడ డిజాస్టర్ గా మిగిలిపోయింది.. అయితే అవకాశాలు మాత్రం ఫుల్లుగా సంపాదించారు సాయి శ్రీనివాస్ త్వరలో భైరవం సినిమాతో రాబోతున్నారు. ఇదే కాకుండా మరో రెండు మూడు చిత్రాలు చేతిలో ఉన్నట్లుగా సమాచారం.
తాజాగా బెల్లంకొండ సురేష్ మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడు గురించి పలు విషయాలు తెలిపారు.. తమ పెద్ద అబ్బాయి లైఫ్ సెటిల్ అయ్యిందని ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నారు ఏప్రిల్ లో తాను ఇంకో సినిమా మొదలు పెట్టబోతున్నారని.. తన కుమారుడు శ్రీనివాస్ పెళ్లి వచ్చే ఏడాది ఉండొచ్చు అరేంజ్డ్ మ్యారేజ్ ఉంటుందని తెలిపారు.. ఈ విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు శ్రీనివాస్ తండ్రి సురేష్.. రెండవ కుమారుడు కెరియర్ ఇంకా సెట్ కావాల్సి ఉందని ఆ తర్వాతే వివాహం చేసుకుంటారని తెలిపారు.. మొత్తానికి బెల్లంకొండ సురేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సైతం వైరల్ గా మారుతున్నాయి.