అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట న్యూస్ రీడర్ గా తన కెరీర్ ప్రారంభించి అనంతరం సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. నాగ సినిమాలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. అనంతరం జబర్దస్త్ షోతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ షోలో తన టాలెంట్ చూసి దర్శకనిర్మాతలు అనసూయకు సినిమాలలో అవకాశాలను ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా అనసూయ క్రేజ్ ఎక్కడికో పెరిగిపోయింది.


బ్యూటీ ఎప్పటికప్పుడు వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. అనసూయ పుష్ప 2 సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనసూయ కీలకమైన పాత్రలో చాలా డిఫరెంట్ గా నటించిందని సమాచారం అందుతోంది. కాగా, పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈవెంట్ కు సినీ ప్రముఖులు అందరు విచ్చేసి సందడి చేశారు. ముఖ్యంగా రాజమౌళి, అల్లు అరవింద్ వంటి వారు వచ్చారు.


అనసూయ కూడా ఈవెంట్ లో పాల్గొంది. కానీ ఈవెంట్ లో అనసూయకు చేదు అనుభవం ఎదురయింది. అనసూయను ఎవరు పెద్దగా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. ఈవెంట్ లో రష్మిక మందన, సుకుమార్, అల్లు అర్జున్ స్పీచ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. వీరు మాట్లాడిన మాటలు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, రష్మిక మాట్లాడిన మాటలు విజయ్ దేవరకొండ హావభావాలకు సరిపోయేలా ఉన్నాయని సోషల్ మీడియా కోడైకూస్తోంది. విజయ్, రష్మిక డేట్ లో ఉన్నారంటూ అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాయి. అయితే ఈ వార్తల పైన రష్మిక కానీ విజయ్ కానీ ఇంతవరకు స్పందించలేదు.


దీంతో ప్రతి ఒక్కరూ వీరి గురించి తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. ఇక రష్మిక విజయ్ కొద్దిరోజుల క్రితమే ఈ విషయం పైన పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. కాగా, అనసూయ పరోక్షంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసుకుంది. అందులో దూరపు కొండలు నునుపు అని రాసుకోచ్చింది. దీంతో పరోక్షంగా అనసూయ విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తూ....కర్ణాటక లాంటి దూరపు ప్రాంతాల నుండి వచ్చిన రష్మికను టార్గెట్ చేసిందని అంటున్నారు. అలాగే కొండలు నునుపులో దేవరకొండ ఇంటి పేరు వచ్చేలా మాట్లాడిందంటూ నేటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి అనసూయ ఎవరిని ఉద్దేశించి ఇలా పోస్ట్ చేసిందో తెలియదు కానీ ఈ పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: