ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ మరికొద్దిగంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక్క తెలుగు ఇండస్ట్రీయే కాదు.. యావత్ భారతీయ చిత్ర పరిశ్రమసినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అమెరికాలో ప్రీమియర్స్ సహా తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలకు రంగం సిద్ధమైంది. టికెట్ రేట్ ఎంతైనా సరే కొనేందుకు అల్లు ఫ్యాన్స్ సై అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఊహించని షాక్ తగిలింది.పుష్ప 2 మేనియాతో దేశం ఊగిపోతోంది. ఆరు భాషల్లో దాదాపు 12 వేల స్క్రీన్‌లలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని చిన్నా, పెద్దా థియేటర్‌లలో పుష్ప 2ను రిలీజ్ చేస్తుండటం విశేషం. తెలుగునాట ప్రతి పెద్ద సినిమా విడుదలవుతున్న సందర్భంగా టికెట్ రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతులు మంజూరు చేస్తుంటాయి. తాజాగా పుష్ప 2కి కూడా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు టికెట్ ధరల పెంపుకు బెనిఫిట్ , స్పెషల్ షోలకు అనుమతులు ఇచ్చాయి.

ఇదిలాఉండగా పుష్ప 2 రిలీజ్‌కు ముందు బన్నీ ఫ్యాన్స్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటకలో పుష్ప 2 మూవీని మిడ్ నైట్, తెల్లవారుజామున ఆటలు ప్రదర్శించవద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం 6 గంటల కంటే ముందు సినిమాను ప్రదర్శించడం చట్ట విరుద్ధమని కన్నడ ప్రొడ్యూసర్‌లు ఫిర్యాదు చేయడంతో బెంగళూరు జిల్లా కలెక్టర్ థియేటర్ల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే స్పెషల్ షోల ప్రదర్శనకు ఏర్పాట్లు చేయగా ప్రభుత్వ నిర్ణయంతో అల్లు అభిమానులు నిరాశకు గురయ్యారు.ఇదిలాఉండగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 టికెట్ ధరల విషయానికి వస్తే.. తెలంగాణలో సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లలో పుష్ప 2 ది రూల్ మూవీకి బెనిఫిట్ షో ధరలు రూ. 800 వరకు పలుకుతోంది. ఇక రిలీజ్ డే నుంచి డిసెంబర్ 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్‌లలో రూ.200, సింగిల్ స్క్రీన్‌లలో రూ. 150 వరకు అదనంగా ధరను పెంచుకోవచ్చు. డిసెంబర్ 9 నుంచి మాత్రం మల్టీప్లెక్స్‌లో రూ. 150, సింగిల్ స్క్రీన్‌లలో రూ. 105 చొప్పున ధరను వసూలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్ధితి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: