టాలీవుడ్ ఇండస్ట్రీనే కాదు పాన్ ఇండియా లెవెల్లో అసలు పరిచయమే అవసరం లేని స్టార్ రేంజ్ కి ఎదిగిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.ఆయన నటించిన పుష్ప సినిమాతోనే  రష్మిక మంధాన, ఫహద్ ఫాజిల్ ఓవర్‌నైట్ పాన్ ఇండియా స్టార్స్‌గా ఎదిగారు .2021లో వచ్చిన 'పుష్ప: ది రైజ్' మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్‌గా నిలిచింది.ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్‌గా 'పుష్ప 2: ది రూల్' డిసెంబరు 5 గురువారం థియేటర్లలోకి రాబోతోంది అయితే ఈ క్రమంలో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప-2' చిత్రం బెనిఫిట్ షోలు పడ్డాయి. రాత్రి 9.30 గంటలకు తొలి బెనిఫిట్ షో పడింది.ఈ క్రమంలో ఈ చిత్రంపై అన్ని చోట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 80 దేశాల్లో 6 భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే రూ. వెయ్యి కోట్లకు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. ఇదిలావుండగా ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట మధ్య ఓ యువకుడు స్పృహ కోల్పోయిన విషాద సంఘటన చోటుచేసుకుంది.ప్రేక్షకులు థియేటర్ ప్రాంగణాన్ని ముంచెత్తారు. దీనికి సంబంధించి అనేక వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.ఒక వీడియోలో, పోలీసు అధికారులు బాలుడి సహాయం కోసం పరుగెత్తటం, CPR చేయడం అతనిని పునరుద్ధరించే ప్రయత్నంలో అతని చేతులు, కాళ్ళను రుద్దడం చూడవచ్చు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.అయితే దీన్ని గమనించిన కొందరు పాపం అని మరికొందరు అసలు అంత చిన్న పిల్లోడకి అక్కడేం పని అని వివిధ రకాల కామెంట్లు పెడుతున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ అప్పుడే సోషల్ మీడియాలో లీక్ అయింది. అభిమానులు ఎక్స్ వేదికగా దీన్ని షేర్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: