అల్లు బాబు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తాజాగా రిలీజైన పుష్ప-2 సందడి గురించి జనాలకి వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజైనప్పటికీ, నిన్న రాత్రి ప్రివ్యూ షోలు పడడంతో టాక్ ముందుగానే బయటకు వచ్చేసింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈరోజు గడిస్తే గాని అసలు టాక్ ఏంటి అనేది తెలియదు. ఇక ఇక్కడ స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే ఆ సందడి ఎలా ఉంటుందో, థియేటర్ల దగ్గర హడావుడి ఎలా వుంటుందో చెప్పనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు దగ్గర పుష్ప-2 సందడి నెలకొంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్, ప్రసాద్ మల్టీప్లెక్స్ లలో అయితే జనాలు కిక్కిరిసిపోతారు.

అయితే, అలాంటిది పుష్ప2 లాంటి పెద్ద సినిమా ప్రసాద్ మల్టీప్లెక్స్ లో పడకపోవడం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప2 భారీ అంచనాలతో నేడు అన్ని చోట్లా రిలీజ్ కాగా, ప్రసాద్ మల్టీప్లెక్స్ లో బొమ్మ పడక పోవడంతో అల్లు ఫాన్స్ తీవ్రమైన నిరాశలో ఉన్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. మరోవైపు ఈ అంశం గీతా ఆర్ట్స్ వారిని కూడా తీవ్రమైన దిగ్బ్రాంతికి గురిచేసినట్టు సమాచారం.

ఇకపోతే, ఎన్నో ఏళ్లుగా ప్రసాద్ లో సినిమాలు చూసే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రసాద్ స్క్రీన్స్ లో ఈ సినిమా అందుబాటులో లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పుకోవాలి. కాగా పర్సంటేజ్ విషయంలో అటు డిస్ట్రిబ్యూటర్స్, ఇటు ప్రసాద్ మధ్య వాగ్వాదం జరిగిందని వినికిడి. దీంతో ఇప్పటివరకు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఓపెన్ కాలేదు. ఈ నేపథ్యంలో మొట్టమొదటి సారి తెలుగు అగ్ర హీరో సినిమా విడుదల లేకపోవడంతో ప్రసాద్ మల్టీప్లెక్స్ మూగబోయినట్టు కనిపిస్తోంది. ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యానికి, పుష్ప2 నిర్మాతలు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ కి ఇంకా డీల్ కుదరలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: