"ఊ అంటావా మావ..ఊ ఊ అంటావ మావ" ..ఈ పాట ఏ రేంజ్ లో దేశాన్ని అల్లాడించేసిందో మనకు తెలిసిందే.  కుర్రాళ్ళను ఓ రేంజ్ లో పిచ్చెక్కించేసింది . సమంత లోని నాటినెస్ ను బయటపెట్టాడు సుకుమార్. అప్పటివరకు సమంత హాట్ గా ఉంటుందని మాత్రమే తెలుసు . సమంత నాటిగా కూడా బిహేవ్ చేస్తుంది అని ఊ అంటావ మావ పాట బయట పెట్టింది . అయితే పుష్ప2లో ఐటమ్ సాంగ్ ఎవరు చేస్తారు ..? ఎలా చేస్తారు..?  ఇందులో లిరిక్స్ ఎలా ఉంటాయి ..? అంటూ జనాలు చాలా చాలా చర్చించుకున్నారు .


ఫైనల్లి యంగ్ బ్యూటీ శ్రీలీల ఆ స్దానాని దక్కించుకుంది . పుష్ప2లో "దెబ్బలు పడతయి రో రాజా..దెబ్బలు పడతాయిరో" అంటూ ఓ రేంజ్ లో విజృంభించేసింది.  కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయిన పుష్ప 2 సినిమా హ్యూజ్ పాజిటివ్ టాక్ అందుకుంది . సూపర్ డూపర్ హిట్ మార్క్ వేసేసారు అభిమానులు. పుష్ప2 లో స్పెషల్ సాంగ్ లో శ్రీలీల అల్లాడించేసింది అంటూ స్టెప్స్ ఆధారంగా చెప్పేసేయొచ్చు. అయితే పుష్ప వన్  సినిమాలో సమంత చాలా నాటి నాటి గానే కనిపిస్తూ బాగా స్టెప్స్ వేసింది.



పక్కాగా చెప్పాలి అంటే హీరోయిన్ రష్మిక మందన్నా కన్నా కూడా సమంత పేరే మారుమ్రోగిపోయింది. అయితే పుష్ప2 విషయంలో మాత్రం సీన్ మొత్తం మారిపోయింది . పుష్ప2 సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించిన శ్రీ లీల పేరు కొంతమంది జనాలే మాట్లాడుకుంటున్నారు ..కానీ రష్మిక మందన్నా మాత్రం తను నటనతో అల్లాడించేసింది . మరీ ముఖ్యంగా పుష్పరాజ్ గాడి భార్య అంటే ఆమాత్రం ఉండాలి అనే రేంజ్ లో తన నటనను చూపించింది . దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా రష్మిక మందన్నా పేరే వినిపిస్తుంది కానీ శ్రీలీల ఐటమ్ సాంగ్ చేసిన ఆ క్రేజ్ దక్కించుకోలేకపోయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: