హమ్మయ..ఫైనల్లీ పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది . ఇన్నాళ్లు పుష్ప 2 సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ..? ఎలాంటి టాక్ దక్కించుకుంటుంది..? అంటూ చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేసారు జనాలు. మరీ ముఖ్యంగా బన్నీ ఫాన్స్ అయితే కళ్ళల్లో వత్తులు వేసుకొని మరీ ఎదురుచూశారు . అలాంటి అభిమానులకి ఫుల్ మీల్స్ అందజేసేసాడు సుకుమార్ .  కొద్ది గంటల క్రితమే  రిలీజ్ అయిన పుష్ప 2 సినిమా ఫుల్ సూపర్ డూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. ఎంతలా అంటే అల్లు అర్జున్ ఫాన్స్ ఓ రేంజ్ లో ఊగిపోతున్నారు .


మరీ ముఖ్యంగా మొదటి నుంచి ఎక్స్పెక్ట్ చేసిన జాతర సీన్స్  పుష్ప2కి హైలైట్ గా మారిపోయింది.  అల్లు అర్జున్ పేరు మారు మ్రోగిపోయేలా చేసింది. ఇప్పుడు ఇదే వైరల్ గా మారింది. సుకుమార్ డైరెక్షన్ ఈ సినిమాకి ప్లస్గా మారిందా? అల్లు అర్జున్ నటన సినిమాని మరో మెట్టు ఎక్కేలా చేసిందా..? అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు . అయితే సోషల్ మీడియాలో మాత్రం జనాలు ఒక బ్యూటీ పేరుని హైలెట్ చేస్తున్నారు . పుష్ప 2 సినిమా హిట్ అవ్వడానికి సుకుమార్ అదే విధంగా బన్నీ కన్నా ఎక్కువగా కారణమైంది రష్మిక మందన్నా అంటూ తేల్చేస్తున్నారు .



ఆమె ఈ సినిమాకి కర్త - కర్మ - క్రియగా అంతా చేసింది అని .. సుకుమార్ డైరెక్షన్ ఓకే అల్లు అర్జున్ నటన కూడా ఓకే ..కానీ ఒక అమ్మాయి అయ్యి ఉండి రష్మిక మందన్నా డైరెక్టర్ ఏ సీన్స్ చెప్తే ఆ సీన్స్ చేయడం అల్లు అర్జున్ కి సహకరించడం సినిమాని వేరే లెవెల్ లో ఉండేలా చేసింది అంటున్నారు. అంతేకాదు పుష్ప వన్ సినిమాలో శ్రీవల్లి పాత్ర చాలా నాటిగా ఉంటుంది . అయితే పుష్ప2లో మాత్రం ఆమె కీలకంగా  మారింది . పుష్ప2 సినిమాలో శ్రీవల్లి గా నటించినందుకు గాను రష్మిక మందన్నాకు కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది అంటున్నారు జనాలు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: