అవును, మీరు విన్నది నిజమే. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న పాపులర్ షో ‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’ ప్రస్తుతం విజయవంతంగా కొనసాగుతోన్న విషయం తెలిసినదే. తాజాగా షోకి సంబందించిన లేటెస్ట్ ఎపిసోడ్‌కు సంబందించిన ప్రోమోను రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో దానికి సంబందించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆదిత్య 369 సినిమా గెటప్‌లో బాలయ్య బాబు స్టేజ్‌పై సందడి చేయడం కొసమెరుపు. ఈ క్రమంలోనే సీక్వెల్ విశేషాలు కూడా ప్రేక్షకులతో బాలయ్య పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘ఆదిత్య 369 చిత్రంకు సీక్వెల్‌గా ఆదిత్య 999 రానుంది. మా అబ్బాయి మోక్షజ్ఞ అందులో హీరోగా నటిస్తాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు జోరుగా జరుగుతున్నాయి. త్వరలోనే ఆదిత్య 999 పట్టాలెక్కుతుంది!’ అని బాలకృష్ణ ప్రకటించారు. అయితే దీనికి సంబందించిన ఫుల్ ఎపిసోడ్ డిసెంబర్ 6న ప్రసారం కానుంది. అప్పుడు మరిన్ని విషయాలు పంచుకునే అవకాశాలు ఉండడంతో నందమూరి ఫాన్స్ ఆ ఎపిసోడ్ గురించి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక మోక్షజ్ఞ ప్రస్తుతం ప్రశాంత్ వర్మతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఇది తెరకెక్కుతున్నట్టు వినికిడి.