అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 1 మూవీ 2021 వ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల అయింది. మరి ఈ సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లైంట్ అయ్యే సరికి ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది. మొత్తంగా ఈ మూవీ కి ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి అనే వివరాలు తెలుసుకుందాం.

టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 85.35 కోట్ల షేర్ ... 133.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక కర్ణాటక ఏరియాలో 11.81 కోట్ల కలెక్షన్లు దక్కగా , తమిళ నాడు ఏరియాలో 13.75 కోట్ల కలెక్షన్లు దక్కాయి. కేరళ లో 5.60 కోట్ల కలెక్షన్లు దక్కగా , హిందీ లో 5.60 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఓవర్ సీస్ లో 14.56 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 184.62 కోట్ల షేర్ ... 360 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 144.90 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ భారీలోకి దిగింది. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 184.62 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేయడంతో ఈ మూవీ కి ఓవరాల్ గా 38.62 కోట్ల లాభాలు దక్కాయి. అలా పుష్ప పార్ట్ 1 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి లాభాలను అందుకొని డీసెంట్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక పుష్ప పార్ట్ 1 మూవీ కి కొనసాగింపుగా రూపొందిన పుష్ప పార్ట్ 2 సినిమా ఈ రోజు అనగా డిసెంబర్ 5 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa