ప్రధానంగా తెలుగులో ఈమె చేసిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి .. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరైన హీరోయిన్ కూడా ఇంతకు ఈ హీరోయిన్ మరి ఎవరో కాదు .. ఈమె పేరు మాళవిక .. అసలు పేరు శ్వేతా కూనూర్ .. సినిమాలోకి వచ్చిన తర్వాత మాళవికగా తన పేరును మార్చుకుంది. తెలుగులో శ్రీకాంత్ , వడ్డే నవీన్ హీరోలుగా వచ్చిన చాలా బాగుంది సినిమాలో హీరోయిన్గా నటించింది ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతోనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు మాళవిక.. అంతకుముందు తమిళ , కన్నడ భాషలో సినిమాల్లో నటించారు. ఆతర్వాత తెలుగులో దీవించండి, శుభకార్యం,నవ్వుతూ బ్రతకాలిరా,ప్రియా నేస్తమా,అప్పారావు డ్రైవింగ్ స్కూల్ వంటి సినిమాలు చేసింది.
ఆ తర్వాత వరుసగా తమిళ పరిశ్రమలో సినిమాలు చేసింది .. అలానే కోలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. 2009 నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు.. ఈ ముద్దుగుమ్మ ఎంతో మారిపోయింది.. ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మాళవిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల పరంగా దూరం అయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.