మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో పుష్ప -1 మూవీకి సీక్వెల్ గా పుష్ప-2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చెప్పనక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ ట్రాక్ తెచ్చుకొని మొదటి షో తోనే పాజిటివ్ రివ్యూలు అందుకుంది. దాంతో ఈ సినిమా చూడడానికి జనాలు ఎగబడుతున్నారు. కొన్ని కొన్ని చోట్ల జనాలు ఎక్కువగా రావడంతో తొక్కిసలాటలు కూడా జరుగుతున్నాయి.సుకుమార్ కి అల్లు అర్జున్ కి ఎంత మంచి అనుబంధం ఉందో చెప్పనక్కర్లేదు.ఆర్య సినిమా సమయం నుండి వీరి మధ్య ఈ బంధం కొనసాగుతూనే ఉంది. అలా అల్లు అర్జున్ స్టార్ అవ్వడానికి కూడా సుకుమార్ ప్రముఖ పాత్ర పోషించారని అల్లు అర్జున్ పదేపదే చెప్పుకు వస్తారు.అయితే అలాంటి అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 సినిమా విడుదలై మంచి విజయం అందుకుంది.

అయితే పుష్ప -2 సినిమా విడుదలకు ముందు చాలామంది హీరోల ఫ్యాన్స్ ఈ సినిమాని తొక్కేయాలని చూసారు. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అయితే సినిమాపై చాలా గుర్రుగా ఉన్నారు. ఎప్పుడైతే నంద్యాల ఘటన జరిగిందో అప్పటినుండి మెగా ఫ్యాన్స్ కి అల్లు ఫాన్స్ కి మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక అప్పుడప్పుడు నాగబాబు, కిర్రాక్ ఆర్పి వంటి వాళ్లు పరోక్షంగా ఈ విషయాలను బయట పెడుతూ ఉంటారు. అయితే తాజాగా పుష్ప-2  సినిమా హిట్ అవ్వడంతో ఇండస్ట్రీలో ఉండే ఆ ఇద్దరు హీరోలకు మింగుడు పడడం లేదు అని అల్లు అర్జున్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. పుష్ప-2  సినిమా ఫ్లాప్ అవ్వాలని ఆ హీరోలు మొక్కని దేవుడు అంటూ లేడు.

కానీ ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి ఎంతో కష్టపడి అల్లు అర్జున్ చేసిన పుష్ప-2 సినిమాని హిట్టు చేయించాడు. కథలో కంటెంట్ ఉంటే ఎవడు ఎన్ని రకాలుగా సినిమాను తొక్కేయాలని చూసినా కూడా అది జరగదు. దానికి పుష్ప-2 సినిమా నిదర్శనం. ఈ సినిమా విడుదలకు ముందు ఎంతోమంది సినిమా ఫ్లాప్ అవ్వాలని తొక్కేయాలని చూసారు. కానీ వాళ్లు అనుకున్నది ఒకటైతే దేవుడు తలచింది మరొకటి..సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ అల్లు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ల మోత మోగిస్తున్నారు.మరి ఇంతకీ పుష్ప-2 సినిమా హిట్ అయితే ఏ హీరోలకు మండుతుంది అనేది మాత్రం చెప్పలేదు.ఇక వాళ్ళు చెప్పకపోయినా ఆ హీరోలెవరో అందరికీ తెలుసు అంటున్నారు అల్లు అభిమానుల పోస్టులు చూసిన నెటిజన్స్..

మరింత సమాచారం తెలుసుకోండి: