ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప2 సినిమా ప్రేక్ష‌కుల‌ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. అలాగే ఫస్ట్ డే కలెక్షన్స్ లో కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ఇప్పటికే ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే రికార్డులు బద్దలు కొట్టిన ఈ సినిమా కలెక్షన్ విషయంలో కూడా అంచనాల‌కి మించి వస్తాయని అంటున్నారు. పుష్ప 2 మానియా కొనసాగుతున్న సమయంలో అల్లు అర్జున్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడే వైరల్ అవుతున్నాయి.


మెగా - అల్లు ఫ్యామిలీల మధ్య సరిగ్గా సంబంధాలు లేవని కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. బయట జరుగుతున్న పరిణామాలు కూడా మెగా వర్సెస్ అల్లూ ఫ్యామిలీ అనే విధంగా ఉన్నాయి. కానీ అల్లు అర్జున్ మాత్రం ఎప్పటికప్పుడు చిరంజీవి పై తన ప్రేమను చూపిస్తూనే వచ్చాడు. ఇక గతంలో అల్లు అర్జున్ , చిరంజీవిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను ఫాన్స్ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ థియేటర్లో ఎక్కువ సార్లు చూసిన సినిమా ఇంద్ర ఈ విషయాన్ని బన్నీ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంద్ర సినిమాని 17 సార్లు చూశాక తన ఫ్రెండ్స్ తో ఒక బెట్టింగ్ జరిగిందట .


ఇంద్ర సినిమాలో వీణ స్టెప్పుని చిరంజీవి గారు మాత్రమే సోలాగా చేశారు. పక్కన ఎవరూ లేరని  చెప్పాడట. కానీ ఆయన ఫ్రెండ్స్ మాత్రం లేదు చిరంజీవి పక్కన హీరోయిన్ సోనాలి బింద్రే ఉందిని 25000 బెట్ట్ క‌ట్ట‌ర‌ట‌.. అలా 18వ సారి వెళ్లి సినిమాని మళ్లీ చూస్తే పక్కన సోనాలి బింద్రే కూడా డాన్స్ చేస్తుంది .. 17 సార్లు ఆ సాంగ్లో చిరంజీవి గారు మాత్రమే కనిపించారు .. చిరంజీవి తప్ప ఇంకెవరిని నేను పట్టించుకోలేదు ఆ విధంగా 25 వేల రూపాయలు నష్టపోయానంటూ బన్నీ ఈ విషయాన్ని చెప్పారు. ఆ విధంగా బన్నీ చిరు పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: