సినిమాల్లో ఉండే సెలబ్రిటీల ఇళ్లల్లో ఏం జరిగినా అది ఓ సెన్సేషన్ .. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే రకరకాల వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇక మరీ ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో ఎన్నో వార్తలు విషయాలు అటు ఇటు అనలైజ్ చేస్తూ రకరకాల వార్తాలు వైరల్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అలాంటి పనే జరుగుతుంది సోషల్ మీడియాలో అక్కినేని వారింటి పెళ్లి గురించి సోషల్ మీడియాలో వైరల్ న్యూస్‌లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే నాగా చైతన్య - శోభిత ధూళిపాళ పెళ్లి నిన్న రాత్రి ఎంతో ఘనంగా జరిగింది.. ఇదే క్రమంలో అఖిల్ పెళ్లి విషయం అనౌన్స్ చేయడంతో అక్కినేని ఫ్యాన్స్ కు డబుల్ గిఫ్ట్ ఇచ్చినట్టు అయింది.


ఇక దాంతో వీరి పెళ్లిళ్ల గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు నెటిజన్లో. ఇప్పటికే అక్కినేని కుటుంబంలో జరిగిన వివాహాల గురించి అందరికీ తెలిసిందే .. ఇప్పుడు అక్కినేని వారసుల పెళ్లిళ్లపై వార్తలు వండి వడ్డిస్తున్నారు. నాగచైతన్య సమంత ప్రేమ పెళ్లి విడాకులు ఇప్పుడు శోభితను పెళ్లారడంతో పాటు అఖిల్ ప్రేమ గతంలో ఆయన ఎంగేజ్మెంట్ కూడా జరిగి పెళ్లి ఆగిపోవడం .. ఇప్పుడు జైనాబ్ తో  పెళ్లి కుదరటం ఎవరికి చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేయడం .. నాగార్జున వ్యాపార సంబంధం కోసం అఖిల కంటే పెళ్ళికూతురు పదేళ్లు పెద్దదంటూ .. మరోపక్క జగన్ బిజినెస్ పార్టనర్ తో అఖిల్ పెళ్ళంటూ ఇలా రకరకాల వార్త‌లు ఇప్పటికే సోషల్ మీడియాలో వచ్చాయి.


ఇలా అఖిల్ పెళ్లిపై ఎన్నో వార్తలు బయటికి వస్తున్నాయి.. అయితే అందులో నిజాలు లేవని అవెంత ఫేక్ మాత్రమే అని నాగార్జున సన్నిహితులు కొట్టి పడేస్తున్నారు.. నాగచైతన్య పెళ్లి జరగపోవటంతో అఖిల్ పెళ్లి కూడా త్వరలోనే జర్పించబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా అఖిల్ పెళ్లి ఇక్కడ కాకుండా అబ్రడ్స్ లో జరగబోతోందని మరో సమాచారం. విదేశాల్లో వ్యాపారాలు చేసే జైనాబ్ తండ్రి.. అక్కడే తన కూతురు పెళ్ళి చేయబోతున్నాడని సామాచారం. అంతే కాదు హైదరాబాద్ లో రిసెప్షన్  ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పెళ్ళికి జగన్ కూడా ప్రత్యేక అతిధి కాబోతున్నాడన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. చూడాలి మరి అఖిల్ పెళ్ళి ఎప్పుడు జరగబోతోంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: