బాలీవుడ్ టాలెంటెడ్ హీరో షాహిద్ కపూర్ గురించి జనాలకు చెప్పాల్సిన అవసరం లేదు. షాహిద్ కపూర్ సీనియర్ నటులు పంకజ్ కపూర్, నీలిమ అజీంల కుమారుడన్న విషయం తెలిసినదే. అయితే షాహిద్ 3వ ఏటనే అతని తల్లిదండ్రులు విడిపోవడం అత్యంత బాధాకరం. ఆప్పట్నుంచీ ఆయన తన తల్లి వద్దే పెరిగారు. ఈ క్రమంలో ఆయన తన 10వ ఏట ముంబైకు వలస వెళ్లారు. 1990ల్లో ఆయన కొన్నిసినిమాల్లో డ్యాన్సర్ గా కూడా పనిచేశారు. ఆ తరువాత కొన్ని మ్యూజిక్ వీడియోల్లోనూ, టీవీ ప్రకటనల్లోనూ నటించారు షాహిద్. ఈ క్రమంలోనే ఆయన సినిమాల్లోకి అరంగేట్రం చేశారు. ఈ క్రమంలో 2003లో ఇష్క్ విష్క్ సినిమాతో తెరంగేట్రం చేసిన షాహిద్ ఆ సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం కూడా అందుకున్నారు.

ఇక అసలు విషయంలోకి వెళితే.. షాహిద్ తెలుగులో వచ్చిన సూపర్ హిట్ చిత్రం అర్జున్ రెడ్డి రీమేక్ లో నటించగా, ఆ సినిమా కూడా బాలీవుడ్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులో దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగానే ఈ సినిమాని తెరకెక్కించిన సంగతి తెలిసినదే. విషయం ఏమిటంటే, ఇటీవల షాహిద్మీడియా వేదికగా ఇంటర్వ్యూలో పాల్గొనగా సదరు యాంకర్ అడిగిన ప్రశ్నకు షాహిద్ తనదైన రీతిలో సమాధానం చెప్పాడు. నేటితరం అమ్మాయిలు "అర్జున్ రెడ్డి" వంటి మనస్తత్వం ఉన్నవారినే ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు జోశ్యం చెప్పుకొచ్చాడు. అయితే ఆయన మాత్రం పర్సనల్ గా అటువంటి పాత్రలకు కనెక్ట్ కానని సమాధానం చెప్పుకురావడం కొసమెరుపు.

ఇకపోతే షాహిద్ బాలీవుడ్లో రొమాంటిక్ హీరోగా పేరు సంపాదించాడు. 2006లో అమృతా రావుతో కలసి నటించిన వివాహ్ సినిమాతో రొమాంటిక్ హీరోగా పేరు వచ్చింది. ఆ తరువాత షాహిద్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన జబ్ వియ్ మెట్ (2007), కమీనే (2009) సినిమాల్లోని నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్స్ దక్కించుకున్నాడు. ఇక 2014లో ఆయన నటించిన "హైదర్" సినిమాకి గాను ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు షాహిద్. 2016లో ఉడ్తా పంజాబ్ లో నటించిన ఆయన అత్యంత ఆకర్షణీయ భారతీయ సెలబ్రిటీగా షాహిద్ పేరు గడించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: