ఆటో రాంప్రసాద్ షూటింగ్స్ పార్టీకి వెళ్తూ ఉండగా రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. రాంప్రసాద్ ముందున్న వెహికల్ సడన్గా బ్రేక్ వేయడంతో ఈ సంఘటన జరిగినట్లుగా సమాచారం.. ఈ తరుణంలోనే జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ కారు బ్యాక్ సైడ్ ఉన్న ఆటో డీ కొట్టిందని దీంతో రాంప్రసాద్ తన కారు ముందుకు జరగాడంతో ముందుర ఉన్న మరొక కారును సైతం ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో అటో రాంప్రసాద్ కి స్వల్ప గాయాలయ్యాయని సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను మాత్రం ఇంకా తెలియజేయలేదు.. ఈ విషయం విన్న అభిమానుల సైతం కాస్త ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ యాక్సిడెంట్ నుంచి త్వరగా కోలుకొని జబర్దస్త్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు..మరి ఈ సంఘటన పైన రాంప్రసాద్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి..
తన కామెడీ టైమింగ్ తో జబర్దస్త్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆటో రాంప్రసాద్..ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో కూడా కమెడియన్ గా నటిస్తూ ఉన్నారు.. ఒకవైపు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కూడా చేస్తున్న రాంప్రసాద్ సినిమాలలో కూడా మరింత ముందుకు రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.. గెటప్ శ్రీను, సుడిగాలి సుదీర్ , సన్ని వీరందరూ కూడా జబర్దస్త్ లో ఒకే టీం గా ఉంటూ కామెడీతో ప్రేక్షకులను బాగా నవ్వించేవారు..