ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప2' నేడు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది.సినిమాలో బన్నీ డైలాగ్స్, యాక్షన్, డ్యాన్స్ ఇలా ప్రతీ ఎలివెంట్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అనుకున్నట్లుగానే ‘పుష్ప 2’ప్రభంజనం సృష్టిస్తోంది.మరి ముఖ్యంగా గంగమ్మ జాతర సీన్  అయితే మరీను.ఈ సినిమాలో వున్నా జాతర సీన్ కు జాతీయ అవార్డు పక్కా అంటున్నారు అభిమానులు. పుష్ప 2 సినిమాలోని గంగమ్మ జాతర సన్నిహితానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకతలు ఇలా వున్నాయి.గంగమ్మ జాతర సన్నిహితం కోసం 60 కోట్లు ఖర్చు చేశారు. గంగమ్మ జాతర సన్నిహితం షూటింగ్‌కు 40 రోజులు పట్టాయి. ప్రతి మే నెలలో తిరుపతిలో జరిగే జాతర ఉత్సవాల సందర్భంగా పూజించబడే గంగమ్మ తల్లిని పుష్ప 2 సినిమాలో చూపించారు.ఒక్కసారిగా ఇంత ఫేమస్ అయినా తిరుపతి గంగమ్మ జాతర ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.ఏటా తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ఈ జాతర జరుగుతుంది. ఎనిమిది రోజులపాటు వైభవంగా జరిగే ఈ జాతరకు, రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. హిందూ పురాణాల ప్రకారం, తిరుమల వెంకటేశ్వర స్వామికి ఈ గంగమ్మ తల్లి చెల్లెలని ప్రతీతి.

అందుకే ప్రతీ సంవత్సరం జాతర సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గంగమ్మకు పుట్టింటి సారెను అందజేస్తారు.అదే విధంగా గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటుంటారు.అలాగే తిరుపతి గ్రామ దేవత గంగమ్మ జాతరలో మరో విశేషం ఉంది. జాతర జరిగినన్ని రోజులు గ్రామస్తులు ఊరి విడిచి వెళ్లరు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా రాత్రుళ్లు బస చేయకుండా వెళ్లిపోవడం ఇక్కడి ఆచారం. తాతయ్యగుంట గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామదేవతగా అవతరించిన గంగమ్మ సాక్షాత్తు తిరుమల శ్రీవారి చెల్లెలుగా కొలుస్తారు.తిరుపతి గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర ఉంది.తిరుపతి గ్రామ దేవత గంగమ్మ జాతరను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. ఈ జాతరలో భక్తులు ఏడు రోజుల పాటు రోజుకో వేషంలో గంగమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు.రాయలసీమలోనే అతిపెద్ద జన జాతరగా తిరుపతి గంగమ్మ జాతరాను పరిగణిస్తారు. శతాబ్దాల క్రితం గంగమ్మ స్థానిక నాయకుడిని వధించినందుకు, స్త్రీల పట్ల అణకువతో చెలరేగిన రాక్షస స్వభావానికి అతన్ని శిక్షించడానికే ఈ పండుగను ప్రవేశపెట్టారు.పేరంటాలు వేషం' సాంప్రదాయకంగా 'కైకాల' వంశస్థులచే ధరించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: