ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్...ఇప్పుడు దునియానే దున్నేస్తున్నాడు. ఎక్కడ తగ్గేదే లేదంటూ...దుమ్ము లేపుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తాజాగా పుష్ప 2 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చిన అల్లు అర్జున్..అదరగొడుతున్నాడు. ఈ సినిమా తెలుగులోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ముఖ్యంగా అమెరికాలో... అల్లు అర్జున్ పుష్ప సినిమానే అన్ని థియేటర్లలో నడుస్తోంది.

 అంతలా ప్రపంచ స్థాయికి అల్లు అర్జున్ పుష్ప సినిమా తాకింది.చేసేది దొంగతనమైన...సినిమా.. కథ అద్భుతంగా ఉండటంతో... దుమ్ము లేచిపోతుంది. ఈ సినిమాలో ఐకాన్ సార్ అల్లు అర్జున్ హీరోగా చేయగా... హీరోయిన్గా రష్మిక మందాన చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. వీరిద్దరి మధ్య జరిగిన రొమాంటిక్ సీన్స్ అలాగే ఎమోషన్స్ సీన్స్ ప్రేక్షకులను బాగా కట్టిపడేసాయి. ఎక్కడ తగ్గేదే లేదం టూ... ఇద్దరు నటించి దుమ్ము లేపారు.

పుష్ప గాడి పవర్ ఏంటో చూపించాడు ఐ కాన్ స్టార్  అల్లు అర్జున్. అయితే...ఈ సినిమాకు.... ఏపీలో అనేక అడ్డంకులు వచ్చాయి.ముఖ్యంగా జనసేన పార్టీ ఈ సినిమాను అడ్డుకుంటుందని...కక్షపూరితంగా వ్యవహరిస్తుందని... అందరూ అనుకున్నారు.కానీ పుష్ప గాడి దెబ్బకు వెనక్కి తగ్గింది జనసేన. వైసిపికి అనుకూలంగా అల్లు అర్జున్ ప్రచారం చేశాడని బన్నీ పైన మెగా కుటుంబంతోపాటు ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

అయితే ఈ మంటలో కూడా... పుష్ప గాడు..తన వరల్డ్ ఫైర్ ఏంటో చూపించాడు. దీంతో మెగా ఫ్యాన్స్ కూడా చల్లబడిపోయారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కంటే ఎక్కువ శాతం మెగా ఫ్యాన్స్... ఈ సినిమాను చూసినట్లు చెబుతున్నారు కొంతమంది విశ్లేషకులు. మరి కొంతమంది అయితే బన్నీ యాక్టింగ్ను పొగుడుతున్నారు. దీంతో మెగా కుటుంబానికి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ ఇటు ఐ కాన్ స్టార్  అల్లు అర్జున్ వైపు వస్తున్నారని సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి.సింగిల్ హ్యాండ్ అల్లు అర్జున్... అందరినీ తన వైపుకు లాక్కుంటున్నాడని... కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: