అయితే అల్లు అర్జున్ హీరోగా చేసిన ఈ పుష్ప 2... ఇప్పుడు మెగా హీరోల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోందని చెప్పవచ్చు. సింగిల్ హ్యాండ్ గా అల్లు అర్జున్ ఈ సినిమాను హిట్ కొట్టుకున్నాడు. ఒక్కడే ప్రచారం చేసుకున్నాడు. మెగా బ్రాండ్ లేకుండా...కేవలం..అల్లు బ్రాండ్ తో.. ఇంతటి సక్సెస్ అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ సింగిల్ హ్యాండ్ గా సక్సెస్ కావడంతో మెగా హీరోలకు కొత్త భయం పట్టుకుంది.
తర్వాత రిలీజ్ అయ్యే మెగా హీరోల సినిమాల పరిస్థితి ఏంటి అని అందరూ చర్చించుకుంటున్నారు. పుష్ప 2 కంటే ఎక్కువ రేంజ్ లో హిట్ కొట్టకపోతే మెగా కుటుంబం పరువు కచ్చితంగా పోతుంది. కాబట్టి ఇప్పుడు మెగా కుటుంబానికి హిట్టు పడాల్సిందే. జనవరి మాసం పదో తేదీన సంక్రాంతి కానుకగా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ అలాగే శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా గ్రాండ్గా తెరకెక్కింది.
అటు ఆర్ ఆర్ ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాతర్వాత మొదటిసారిగా ప్రేక్షకులం ముందుకు వస్తున్నాడు రామ్ చరణ్. ఇటు పుష్ప ఎఫెక్ట్ కూడా రామ్ చరణ్ పైన పడింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రామ్ చరణ్ హిట్ ఖచ్చితంగా కొట్టాల్సిందే. లేకపోతే రామ్ చరణ్ పర్వే కాకుండా మెగా కుటుంబం పరువు మొత్తం పోతుందని కొంతమంది అంటున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న గేమ్ చెంజర్ ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.